మీ ఆయనకు మీలో నచ్చే గుణం ఏంటో మీ రాశి చెప్తుంది : వెంటనే మీరూ చెక్ చేసుకోండి..

భార్యాభర్తల మధ్య ప్రేమ, గొడవ, ఆప్యాయత, అనురాగాలు..ఇలా ఉండటం సర్వసాధారణమే. అయితే మనలో చాలామంది రాశులు, జన్మ నక్షత్రం, హస్త రేఖల ద్వారా మన భవిష్యత్ ఏంటో తెలుసుకుంటుంటాం. అలాగే మీ భర్తకు మీలో నచ్చే గుణం ఏంటో మీ రాశి చెబుతుంది. అదెలాగో మీరే తెలుసుకోండి.

మేషం (మార్చి 21-ఏప్రిల్ 19)

అందరూ భర్తలు తమ భార్య తనకు ఇష్టం వచ్చినట్లు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేవారు చాలా అరుదుగా ఉండొచ్చు. అయితే  ఈ రాశి ప్రకారం మీ భర్త మీ నుండి నాయకత్వ లక్షణాలు కోరుకుంటాడు. అంటే ఏదైనా సమస్య వచ్చినా మీరు దగ్గరుండి చూసుకోగలరని, కుటుంబం, బాధ్యతగా ఉండటం మీ భర్తకు నచ్చే విషయం.

వృషభం (ఏప్రిల్ 20-మే 20)

ఈ రాశి ప్రకారం మీ ఆయనకు మీలో ఓపిక మరియు స్థిరత్వం నచ్చుతాయి. ఏ విషయానికి గాబరా, కంగారు పడకుండా అలాగే ఏ విషయంలోనూ వాదించకుండా కొద్దిసేపు ఓపికగా ఉండటం, స్థిరత్వంగా ఉండటాన్ని కోరుకుంటాడు.

మిధున రాశి (మే 21-జూన్ 20)

సాధారణంగా ఈ రాశి, జన్మ ప్రకారం వీరు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవడం, ఇంకొకటి నూతనంగా ఆలోచిస్తూ ఉండటం. అయితే ఎప్పటికప్పుడు వీరి ఆలోచనలు మారుతూ ఉంటాయి. కానీ మీరు కుటుంబాన్ని ప్రేమించడం అంటే మీ ఆయనకు చాలా ఇష్టం.

కర్కాటక (జూన్ 21-జులై 22)

మీరు ఆఫీస్ కు వెళ్లి పనిచేసేవారు ఐతే మీకు ఆఫీస్ ఎంత ముఖ్యమో, మీ పిల్లల పట్ల బాధ్యత కూడా అంతే ముఖ్యమని, వారితో సమయం గడపాలని మీ భర్త   మీ నుండి కోరుకుంటాడు. అలాగే ప్రతి భర్త నుండి ప్రతి భార్య కోరుకునే మొదటి గుణం ఇదే. 

సింహ రాశి (జులై 23 -ఆగస్టు 22)

భార్యగా మీ ఆయన గురించి, తల్లిగా మీ పిల్లల గురించి ఇలా ప్రతి ఒక్కరి గురించి ఆర్ధిక ఇబ్బందుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీ ఆయనకు మీపై ఉండే ప్రేమ, ఇష్టం కారణంగా అవన్నీ వదిలేయ్ నేను చూసుకుంటాను కదా నువ్వు హ్యాపీగా ఉండు అని ఇష్టపడతాడు. మీరు టెన్షన్ పడితే మీ భర్త తట్టుకోలేరు.

కన్య రాశి (ఆగస్టు 23-సెప్టెంబర్ 22)

మీ కుటుంబాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో మీ ఆయనకు బాగా తెలుసు. అలాగే మీరు ఇతరులతో కలిసి పోవడం, ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు మీరే ముందు ఉండి చూసుకోవాలని, అందరినీ ఆప్యాయంగా పలకరించాలని ఈ రాశి వారిలో భర్తలకు నచ్చే గుణం.

తుల రాశి (సెప్టెంబర్ 23-అక్టోబర్ 22)

చాలావరకు భర్తలు పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు, అది వారి బాధ్యత కూడా. భర్తలు ఇంటిపనికే పరిమితం అయ్యి ఉంటారు.  కానీ ఈ రాశి వారి నుండి తమ భార్య కూడా తనకు అండగా, సహాయ సహకారాలు ఉంటే బాగుణ్ణు అని కోరుకుంటాడు. అది కూడా మీకు ఇష్టమైతేనే.

వృశ్చిక రాశి (అక్టోబర్ 23-నవంబర్ 21)

మీ పిల్లలకు ఉన్నట్లుండి అనారోగ్యం బాగోకపోతే మీ ఆయన మీ పక్కనలేనప్పుడు గానీ ఏదైనా అపాయం వచ్చినప్పుడు నేను చూసుకోగలను అనే ధైర్యం అంటే మీ ఆయనకు బాగా నచ్చుతుంది. అలా కాకుండా నిస్సహాయతగా ఉండటం మీ ఆయనకు నచ్చదు.

ధనుస్సు రాశి (నవంబర్ 22-డిసెంబర్ 21)

ప్రతి భర్తకు తన భార్యతో కలిసి ఏదైనా అడ్వెంచర్ (సాహసం) చేయాలని, ఇద్దరూ కలిసి కొన్ని రోజుల పాటు ఈ ప్రపంచానికి దూరంగా వెళ్లాలని, ప్రయాణాలు చేయాలని ఆశపడుతూ ఉంటారు. అలా మీ ఆయన అడగ్గానే మీరు వెంటనే నేను కూడా రెడీ అని చెప్పడం మీ ఆయనకు బాగా నచ్చుతుంది. అలా కాకుండా ఏం వెళ్దాం లేండి అంటే నిరుత్సాహ పడతాడు.

మకరం (డిసెంబర్ 22-జూలై 19)

మన పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మీ ఆయనకు ఈ రాశి వారిలో నచ్చుతాయి. అలాగే జీవితాన్ని సంతోషంగా, ఉల్లాసంగా గడపడానికి ఇష్టపడతారు. తన ఆఫీస్ వ్యవహారాలు ఎన్ని ఉన్నా రెండిటినీ బ్యాలెన్స్ చేస్తుంటాడు. మీరు కూడా మీ ఆయనలా ఉండాలని కోరుకుంటాడు.

కుంభ రాశి (జనవరి 20-ఫిబ్రవరి 18)

మీ ముందు ఎవరైనా తప్పు చేస్తే వారిని నిలదీయడం, నీతి నిజాయితీ గలవారికి తోడుగా ఉండటం మీ ఆయనకు ఈ రాశి వారిలో బాగా నచ్చుతుంది. అలా కాకుండా మనకెందుకులే అని వదిలేస్తే మీపై గౌరవం తగ్గుతుంది.

మీన రాశి (ఫిబ్రవరి 19-మార్చి 20)

మీ కుటుంబాన్ని మీకంటే బాగా ఎవరు బాగా చూసుకోలేరని, మీ కుటుంబానికి మీరు గుండెలాంటి వారని మీ ఆయనకు బాగా తెలుసు. అలాగే మీ తెలివితేటలు కూడా బాగా నచ్చుతాయి. అందుకే మీ ఆయన ఏదైనా అడిగితే తెలివైన సమాధానం కోరుకుంటాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. తనకంటే ఎక్కువగా మిమ్మల్నే మీ భర్త నమ్ముతాడు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే, అందరికీ ఉపయోగపడే విషయం అని మీకు అనిపిస్తే వెంటనే LIKE మరియు SHARE చేయండి. అలాగే మీ COMMENT కూడా తెలుపవచ్చు.

ఇవి కూడా చదవండి. 

మీ పిల్లలకు దగ్గరవ్యడానికి మీరు చేయాల్సిన 7 పనులు

Leave a Reply

%d bloggers like this: