మీ ఆరోగ్యం గురించి మీ రొమ్ములు తెలిపే 5 విషయాలు

మహిళలు తమ శరీరంలో మార్పుల గురించి, జననాంగాల సమస్యల గురించి ఎవరితో చెప్పుకోవాలి? ఎలా చెప్పుకోవాలో చాలా మదనపడుతూ ఉంటారు. అయితే మీ రొమ్ముల ద్వారా మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఛాతీ మీ ఆరోగ్యం గురించి మీకు ముందే తెలిపే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి.

మీ ఛాతీ తగ్గిపోతుందా?

మీ వక్షోజాల సైజు లేదా ఛాతీ భాగం తగ్గిపోతున్నట్లయితే మీరు బరువు తగ్గుతున్నారని అర్థం. అలాగే మీ శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ లెవల్స్ తగ్గిపోవడం కూడా ఛాతీ సైజు తగ్గడానికి కారణం. అంటే మీరు సరైన డైట్ పాటించకపోవడం వలన, మంచి ఫుడ్ తీసుకోకపోవడమే అని గుర్తించాలి. కొన్నిసార్లు బరువు  తగ్గకపోయినా ఛాతీ సైజు తగ్గిపోతుంటే వెంటనే డాక్టర్ ను కలవాలి.

ఛాతీ పరిమాణం మారుతుంటే..?

మహిళల ఛాతీ భాగం ప్రతి ఒక్కరిలోనూ ఒకే విధంగా ఉండదు. మీరు తీసుకునే ఫుడ్, ధరించే బ్రా, హార్మోన్ల  అసమతుల్యత కారణంగా, ఛాతీపై ఎక్కువ ఒత్తిడి కలిగినప్పుడు ఛాతీ పరిమాణం మారుతూ ఉంటుంది. అలాగే కొందరిలో ఉన్నట్లుండి రొమ్ము పరిమాణం మారుతుంటుంది. ఇలా జరుగుతున్నట్లయితే అలసట, నీరసం కలగడం జరుగుతుంది.

బ్రెస్ట్ సైజు పెరుగుతూ ఉంటే ..?

సాధారణంగా మీరు బరువు పెరగడం లేదా లావు పెరుగుతున్నప్పుడు మీ బ్రెస్ట్ సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు శరీరంలో ఎలాంటి మార్పులు లేకపోయినా బ్రెస్ట్ సైజు పెరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఈ విధంగా జరుగుతుంది. పీరియడ్స్ సమయంలో, గర్భంతో ఉన్నప్పుడు, గర్భ నిరోధక మాత్రలు వేసుకుంటున్నప్పుడు బ్రెస్ట్ సైజు పెరుగుతుంది. ఈ కారణాలు కాకుండా బ్రెస్ట్ సైజు పెరిగితే వైద్యుడి సలహా తీసుకోవాలి.

వక్షోజాల సున్నితత్వం

మీ వక్షోజాలు సున్నితత్వంగా, మళ్ళీ మళ్ళీ ఛాతీపై తాకాలని ఉండటం అనేది కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. పీరియడ్స్ దగ్గరపడుతున్నప్పుడు ఈ విధంగా అవుతూ ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు నిపుల్స్ సున్నితంగా ఉండటమే ఇందుకు కారణం.

మీ ఛాతీపై సిరలు ఉంటే?

మహిళల ఛాతీ లేదా వక్షోజాలపై కొందరిలో చర్మం లేతగా ఉండటం, మరి కొందరిలో సున్నితత్వం లేకుండా సిరలు ఏర్పడి ఉంటాయి. ఇలా ఉంటే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అంటే మీ శరీరం ఎండలో తిరిగినప్పుడు, ఏవైనా మందులు వాడుతున్నపుడు ఈ విధంగా జరుగుతుంది. కొన్ని స్కిన్ క్రీమ్స్ వాడటం వలన ఇది తగ్గిపోతుంది.

దురద లేదా మంటపెడుతుంటే

ఇది చాలామందిలో ఎదురవుతున్న సమస్య. శుభ్రంగా స్నానం చేసినా కూడా ఛాతీపై దురద, మంట కలుగుతుంటాయి. మీరు ధరించే బిగుతైన బ్రా మరియు సరిగ్గా ఉతకపోవడమే ఇందుకు కారణం. అందుకని వదులుగా ఉండే బ్రా, ముఖ్యంగా కాటన్ బ్రా ధరించడం మంచిది.

నిప్పుల్ డిశ్చార్జ్ 

కొన్నిసార్లు రొమ్ముల నుండి రక్తం లీక్ అవ్వడం, పాలిచ్చే తల్లులలో పాలతో పాటు రక్తం బయటకు వస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. థైరాయిడ్ సమస్యల వలన, కణతుల కారణంగా, పాల నాళాలు తగ్గడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ సూచికగా గుర్తించి వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. 

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే, అందరికీ ఉపయోగపడే విషయం అని మీకు అనిపిస్తే వెంటనే LIKE మరియు SHARE చేయండి.  అలాగే మీ COMMENT కూడా తెలుపవచ్చు.

ఇవి కూడా చదవండి.

అమ్మగా మీ జీవితం సంతోషంగా ఉండడానికి 4 మార్గాలు : ఇవి పాటిస్తే ఎల్లప్పుడూ సంతోషమే

Leave a Reply

%d bloggers like this: