మీ పిల్లల పుట్టుమచ్చలు వారి గురించి ఏం చెబుతాయి?

పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఏ పేరు పెడితే బాగుంటుంది, వారి భవిష్యత్ ఎలా ఉంటుందోనని ప్రతి తల్లితండ్రులు  ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అందుకే జాతక చక్రం, జన్మ రాశి, హస్త రేఖలు చూపించడం చేస్తుంటారు. అయితే శరీరంపై ఉండే పుట్టుమచ్చల ద్వారా కూడా వారి భవిష్యత్ మరియు వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు.  అది ఎలాగో మీరే తెలుసుకోండి.

గడ్డం మరియు నోటి చుట్టూ

కొంతమందిలో పుట్టుకతో వచ్చిన మచ్చలు అలాగే ఉంటే, మరికొందరిలో వయస్సు మీద పడేకొద్దీ కనిపిస్తూ ఉంటాయి. అయితే గడ్డం మరియు నోటి చుట్టూ పుట్టుమచ్చ ఉంటే వీరు చాలా అందంగా ఉంటారు. అలాగే తమ జీవితంలో ఇబ్బందులు రాకుండా ముందే ఎక్కువ జాగ్రత్త పడుతూ ఉంటారు.

బొడ్డు కింద పుట్టుమచ్చ

ఈ భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరికి డబ్బుతో ఎటువంటి ఉండదు. డబ్బు సంపాదనకు తమ తెలివి తేటలే చాలు ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగే ఏదైనా అందరిముందు ఓపెన్ గానే చెబుతారు.

తల నుదుటి భాగంలో

వీళ్ళ చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఏదైనా పని అనుకుంటే అందులో విజయం సాధించేవరకు పోరాడుతూ ఉంటారు. వీరు చేసే పనివల్లే వీరికి హోదా, పేరు దక్కుతాయి.

మెడపై పుట్టుమచ్చ

ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నవారు అసాధారణ వ్యక్తులే అని చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళతో పోలిస్తే అందరికంటే విభిన్నంగా, కొత్తగా ఆలోచించడం చేస్తుంటారు. కుటుంబం అంటే చాలా ఇష్టం.

కను బొమ్మల మధ్య

కను బొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే వీరు చాలా స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. అలాగే తిరుగుబాటు చేస్తుంటారు, అన్యాయం అనిపిస్తేనే. ప్రకృతి ప్రేమికులు మరియు ఆకర్షణీయమైన వారు.

చెంపలపై పుట్టుమచ్చ

కుడి చెంప/ బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే సున్నితమైన స్వభావం కలిగిన వారు. ఏదైనా మాట అన్నా సరే తట్టుకోలేరు. ఇక ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉంటే త్వరగా ఏ విషయాన్నీ బయటకు చెప్పరు. లోలోపల ఆలోచించడం, బాధపడటం వీరి వీక్ నెస్.

ముక్కుపై పుట్టుమచ్చ

వీరికి వెంటనే కోపం వచ్చేస్తుంది. అప్పుడప్పుడు మన పెద్దలు అంటుంటారు కదా వీడికి ముక్కు మీద కోపం అని.  అయితే మళ్ళీ వీరే వెళ్లి మాట్లాడించడం చేస్తుంటారు. సరసం కాస్త ఎక్కువే.

ఎద భాగంలో మచ్చ ఉంటే

ఈ భాగంలో పుట్టుమచ్చ ఉంటే నిద్రలేవడం, ఏదైనా పని త్వరగా చేయడం ఎక్కడికైనా వెళ్లడం అంటే కాస్త బద్ధకం ఎక్కువ. అయితే లగ్జరీగా బ్రతకడం అంటే ఇష్టపడతారు.

కను గుడ్డుపై పుట్టుమచ్చ

కుడికన్నుపై మచ్చ ఉంటే వీరు సులభంగా డబ్బు సంపాదించగలరని, అదే ఎడమకన్నులో ఉంటే అహంకార స్వభావమని చెబుతున్నారు.

భుజంపై పుట్టుమచ్చ

ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నవారు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. ఎక్కువ మాట్లాడరు, ఎప్పుడు సైలెంట్ గా ఉంటూ తమపని తాము చూసుకునే టైప్. నిజాయితీ పరులు.

చెవిపై పుట్టుమచ్చ

చెవిపై లేదా చెవి భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరికి కుటుంబం,  స్నేహితులే లోకం. వీరిని విడిచిపెట్టి ఉండలేరు.

ఇంకా మీకు పుట్టుమచ్చల గురించి తెలుసుకోవాలని ఉంటే మాకు COMMENT చేయండి. అలాగే అందరికీ SHARE చేయడం మర్చిపోకండి. 

Leave a Reply

%d bloggers like this: