మీ భర్త మీ పిల్లలతో ఎలా ఉండాలి? ప్రతి భార్య కోరుకునే 4 లక్షణాలు

 ఒక తల్లి తన పిల్లలతో నీకు అమ్మంటే ఇష్టమా? నాన్నంటే ఇష్టమా? అని అడిగింది. దానికి పిల్లలు నాన్నంటే ఇష్టమని చెప్పారు. పిల్లలు చెప్పిన సమాధానానికి ఆ  తల్లి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఎప్పుడు నేనే కదా వీరితో ఉండేది మరి నాన్నంటే ఎలా ఇష్టమని ఎలా చెప్పారు అని. పిల్లలు నాన్నను ఎక్కువగా మిస్ అవుతున్నారు కాబట్టి నాన్నంటే ఇష్టమని చెప్పారు. అందుకే మీ భర్త మీ పిల్లలతో ఎలా ఉండాలో తెలుసుకుని మీ ఆయనకు ఖచ్చితంగా  చెప్పి చూడండి.

ధైర్యాన్ని కోరుకుంటారు

తల్లిగా మీ బిడ్డలకు ఏం చేయాలో, ఎలా పెంచాలో, ఎటువంటి ఆహారం ఇస్తే వారు ఆరోగ్యంగా ఉంటారో మీకు తప్ప మరెవరికీ తెలియదు. కానీ తండ్రి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని ఇవ్వడానికి తండ్రి పక్కనలేకపోతే డాడీని బాగా మిస్ అవుతున్నాం అనే బాధ ఉంటుంది. మీకు చెప్పాలనుకుంటారు కానీ మీరు మీ ఆయనను మిస్ అవుతుంటే ఇక వారేం చెబుతారు.

కోపంగా ప్రవర్తించకూడదు

చాలామంది తండ్రులు నా బిడ్డలు ఇలా ఉండాలి? అలా ఉండాలని క్రమశిక్షణ పేరుతో చిన్నప్పటి నుండే వారికి లేనిపోని లక్ష్యాలు పెట్టడం, ఏదైనా సరిగ్గా చేయకపోతే దురుసుగా ప్రవర్తించి కొట్టడం, కోపం తెచ్చుకోవడం వలన వారికి వయస్సు పెరిగే కొద్దీ తండ్రిపై అయిష్టం పెరుగుతుంది.  మీ భర్త వారి భవిష్యత్ కోసమే చేసి ఉండవచ్చు కానీ అదే విషయాన్ని ప్రేమగా చెప్పమని చెప్పాలి.

డబ్బులు కోరుకోరు ఇవి కావాలంటారు

తండ్రి అంటే పిల్లల బాధ్యత చూడాలని డబ్బులు సంపాదించే పనిలో బిజీగా ఉండటం వలన తల్లిగా మీరే ఆ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే పిల్లలు ఎప్పుడు డబ్బులు కావాలని కోరుకోరు, కానీ తండ్రి పక్కనే ఉండి తమకు ఇష్టమైనవి కొనిపించడం, ఎక్కడికైనా తీసుకెళ్లాలని కోరుకుంటారు.

మీతో ఇలా ప్రవర్తించకూడదు

తల్లితండ్రులు ఎప్పుడు పిల్లల ముందు గొడవపడటం చేయకూడదు. అలాగే మీ భర్తకు మీపై కోపం వచ్చినా, చిరాకుగా ఉన్నా పిల్లల ముందే అనరాని మాటలు అనటం వలన పిల్లల దృష్టిలో బ్యాడ్ ఫాదర్ గా మిగులుతారు మరియు పెళ్లి అనే బంధంపై పిల్లలకు తప్పుడు ప్రభావం కలుగుతుంది.

ప్రతి ఒక్క తల్లితండ్రులు తమ పిల్లలకు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పంచుతారు అనేది నిజమే కానీ ఈ విషయాలు తెలిసి కూడా పట్టించుకోరు. అందుకే మీ ఆయనకు తెలిసేలా SHARE చేయండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే, అందరికీ ఉపయోగపడే విషయం అని మీకు అనిపిస్తే వెంటనే LIKE మరియు SHARE చేయండి.  అలాగే మీ COMMENT కూడా తెలుపవచ్చు.

ఇవి కూడా చదవండి. 

ప్రతి భార్య తన భర్త నుండి ఏం కోరుకుంటుంది?

Leave a Reply

%d bloggers like this: