సిజేరియన్ ఆపరేషన్ జరిగిన వెంటనే మీరు చేయకూడని 10 పనులు

మీకు సి-సెక్షన్ డెలివరీ జరిగిందా? అందరూ ఇలా చేయాలి, ఆలా చేయకూడదు అని సలహాలు ఇస్తున్నారా ? కంగారు పడకండి. ఈరోజుల్లో సి-సెక్షన్ డెలివరి జరగడం చాలా సాధారణమైన విషయం. అయితే డెలివరి జరిగిన తరువాత కొన్ని జాగ్రతలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా సిజేరియన్ ఆపరేషన్ జరిగిన తరువాత, కొన్ని పనులు చేయకూడదు, అవేంటో తెలుసుకోండి…

1. గ్యాస్ వద్దు 

సిజేరియన్ జరిగిన తరువాత, కొన్ని రోజులు తీసుకునే ఆహరం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారాలు తినకండి. అవి మీ కడుపు మీద ప్రభావం చూపిస్తాయి. కుట్రలకు ఇబంది కలగవచ్చు.

2. మలబద్దకం

మలబద్దకం కలిగించే ఆహారాలకు, సాధ్యమైనంత దూరంగా ఉండండి. మలబద్దకం వలన మీ పొట్ట మీద ఎక్కువ వత్తిడి పడుతుంది. తేలికైన, పీచు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోండి.

3. జలుబు

సిజేరియన్ జరిగిన తరువాత, కొన్ని రోజుల వరకు జలుబు, దగ్గు రాకుండా జాగ్రత్తగా ఉండండి. దగ్గు, తుమ్ములు చాలా ప్రమాదం. మీరు సడన్’గా తుమ్మడం దగ్గడం చేసినప్పుడు, అవి కుట్ల మీద వత్తిడిని కలిగించి, కుట్లు తెగిపోయే ప్రమాదం ఉంటుంది.

4. నవ్వకండి

జోకులు చెప్పి మిమ్మల్ని బాగా నవ్వించే వాళ్ళు ఎవరైనా ఉంటే, సిజేరియన్ జరిగిన కొన్ని రోజుల వరకు వారికి దూరంగా ఉండండి. నవ్వినా చిన్నగా నవ్వండి. పెద్దగా శరీరం మొత్తం కదలికలు వచ్చేలా నవ్వకండి.

5. మధనపడకండి

సిజేరియన్ ఆపరేషన్ జరిగిన తరువాత, మీకు నార్మల్ డెలివరీ జరగలేదని బాదడకండి. జరిగిపోయిన విషయం గురించి ఆలోచించకండి. మీరు ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద దృష్టి పెట్టండి.

6. తాకకండి

మీకు కుట్లు వేసిన పోతి కడుపు భాగాన్ని ప్రతి తాకడం, తడమడం లాంటివి చేయకండి. మీ చేతుల్లో ఉండే క్రిములు ఆ గాయానికి వ్యాపించచ్చు. మీరు ఆలా చేతితో తాకుతూ ఉండడం వలన, గాయం తగ్గడానికి ఎక్కువ రోజులు పడుతుంది.

7. ఇంటి పనులు

సిజేరియన్ ఆపరేషన్ జరిగిన కొన్ని రోజుల వరకు మీరు పనులు చేయకపోవడం మంచిది. వంగి చిమ్మడం, బరువులు ఎత్తడం లాంటి పనులకు వీలైనంత దూరంగా ఉండండి. కుట్లు మానేక కూడా తేలిక పాటి పనులు మాత్రమే చేయండి.

8. మెట్లు ఎక్కడం

సిజేరియన్ జరిగిన వెంటనే మీరు చేయకూడని పనులలో మెట్ల ఎక్కడం కూడా ఒక్కటి. మెట్లు ఎక్కేటప్పుడు జరిగే కదలికల వలన మీ పోతి కడుపు మీద ఎక్కువ వత్తిడి పడుతుంది. ఏవి కుట్లను కదిలించి గాయాన్ని ఎక్కువ చేస్తాయి. అందుకే సిజేరియన్ జరిగిన తరువాత కొన్ని రోజుల వరకు మెట్లు ఎక్కడం, పరిగెత్తడం, లాంటి పనులు చేయకండి.

9. నొప్పి భరించకండి

సిజేరియన్ తరువాత మీకు గాయమైన చోట నొప్పి ఎక్కువగా ఉంటే, బలవంతంగా భరించకండి.  నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ తీసుకోండి.  అయితే డాక్టర్ ను సంప్రదించి, వారు చెప్పిన మాత్రలను మాత్రమే తీసుకోండి. సొంత వైద్యాలు వద్దు.

10. తడవనివ్వకండి

స్నానం చేసే సమయంలో మీ గాయం తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి. స్నానం చేయడం కన్నా గాయం పచ్చి తగ్గే వరకు, తడి గుడ్డతో శరీరం తుడుచుకోవడం మంచిది.

సిజేరియన్ తరువాత మీరు ఈ జాగ్రత్తలు అన్ని తీసుకుంటే,  త్వరగా కోలుకుంటారు. భయపడకండి!! ధైర్యంగా ఉండండి… అందరికి తప్పకుండా SHARE చేయండి… 

Leave a Reply

%d bloggers like this: