స్పెషల్ స్వీట్ “ బాదుషా “ : 10 నిముషాల్లో ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి

కావాల్సిన పదార్ధాలు:

1. మైదా –  ఒకటిన్నర కప్పు

2. చక్కర – పావు కిలో

3. బేకింగ్ సోడా – అర టేబుల్ స్పూన్

4. నెయ్యి – పావు కప్పు

5. పెరుగు – పావు కప్పు

6. నీళ్ళు – పావు కప్పు

7. కుంకుమ పువ్వు – చిటికెడు

8. యాలకుల పొడి – చిటికెడు

తయారీ విధానం:

Video Credits : Hebbars Kirchen

1. పిండి కలుపుకోవడం

ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో, మైదా, చక్కర, బేకింగ్ సోడా, బాగా కలపండి. తర్వాత పావు కప్పు నెయ్యి వేసి గడ్డలు కట్టకుండా కలుపుకోండి.  తర్వాత పావు కప్పు నీరు, పావు కప్పు పెరుగు అందులో కలిపి, పిండిని మెత్తగా చేసుకోండి. దానిని ఒక 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి.

2. పాకం పెట్టుకోవడం

బాణలి వేడి అయ్యాక, అందులో పావు కప్పు నీరు పొయ్యండి. తర్వాత పావు కప్పు చక్కర వేసి కాసేపు కలియపెట్టండి. తర్వాత చిటికెడు కుంకుమ పువ్వు, యాలకుల పొడి అందులో వేసి ఒక 5 నిముషాల పాటు మరగనివ్వండి. అంతే పాకం పూర్తయినట్టే

3. బాదుషా తయారి

కలుపుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసి, బాదుషా ఆకారంలో తయారు చేసుకోండి. వీటిని తక్కువ మంట  మీద నూనెలో 15 నిమిషాల వరకు వేయించండి. రెండు పక్కల బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. తరువాత వీటిని చక్కర పాకం లో , 5 నిమిషాల పాటు నాననివ్వండి.

సో చూశారుగా ఎలా తయారుచేసుకోవాలో..  స్పెషల్ బాదుషా రెడీ చేసి మీ ఇంటిల్లిపాదికీ తినిపించండి.  

Leave a Reply

%d bloggers like this: