1-5 ఏళ్ళ లోపు పిల్లలు ఏ ఆహారం తినకపోతే ఎటువంటి వ్యాధులు వస్తాయి?

పిల్లలు పుట్టిన తర్వాత వారి ఆరోగ్య రక్షణపై తల్లితండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మొదటి 5 ఏళ్ళలో పిల్లలు తీసుకునే ఆహారంపైనే వారి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ ఆహార పదార్థాలు 1-5 నుండి ఏళ్ళ లోపు మిస్ అవ్వడం వలన కొన్ని ప్రమాదకర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆలస్యం చేయకుండా వెంటనే తెలుసుకోండి, అందరికీ SHARE చేయండి.

1-5 ఏళ్ళ లోపు పిల్లలలో సాధారణంగా వచ్చే వ్యాధులు

చిన్న పిల్లలలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు, కడుపునొప్పి, జ్వరం తగ్గుతూ వస్తూ ఉండటం, ఎత్తు పెరగకపోవడం, అధిక బరువు సమస్య, జీర్ణ ప్రక్రియ సరిగ్గా ఉండకపోవడం, దంతాలు చిగుళ్ల సమస్య, చర్మ సమస్యలు, రక్తపోటు, నరాలు కండరాల బలహీనత, కళ్ళ మంటలు, వాంతులు, ఆస్తమా, డైయేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తుంటాయి.

పిల్లలకు తప్పకుండా తినిపించాల్సిన ఆహారాలు:
క్యారెట్

పిల్లలకు తల్లి పాలను 6 నెలల వరకు తప్పకుండా ఇవ్వాలి. పాలు పట్టించడం ఆపిన తర్వాత సాలిడ్ ఫుడ్ ఇవ్వడం మొదలు పెట్టవచ్చు. అందుకని క్యారెట్ ను శుభ్రంగా కడిగి పది నిముషాల పాటు బాగా ఉడికించాలి. ఉడికిన క్యారెట్ ను గుజ్జుగా చేసుకుని అందులో కాస్త పాలు కలిపి ఇవ్వడం తినిపించడం వలన కంటికి మంచిది మరియు ఆరోగ్యంగా ఉంటారు.

ఓట్స్ అండ్ బార్లీ

ప్రస్తుత రోజుల్లో పిల్లలతో పాటు పెద్దలు కూడా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఓట్స్ అండ్ బార్లీ. ఓట్స్ ను పాలతో కలిపి పిల్లలకు తినిపించడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ చేరకుండా పనిచేస్తుంది. గుండెకు మంచి బలాన్ని ఇస్తుంది.

ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్

మొదటి రెండేళ్ల లోపు పిల్లలకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇచ్చేటప్పుడు వాటిని ఉడికించి మెత్తని గుజ్జుగా చేసి ఇవ్వడం మంచిది. ఇలా చేయడం వలన త్వరగా అరుగుదల ఉంటుంది. అరటిపండు, బొప్పాయి, అవకాడో, నేరేడు, ఆరంజ్, రేగు, చిలకడ దుంప, బంగాళా దుంప, ఆకు కూరలను ఆహారంగా ఇవ్వాలి.

న్యూట్రియెంట్స్ ఫుడ్స్

చిన్న వయస్సులో పిల్లలకు సరైన పౌష్టిక ఆహారం, న్యూట్రియెంట్స్ ఫుడ్స్ తక్కువ అవ్వటం వలన హార్ట్ డిసీజెస్, హైపర్ టెన్షన్, ఒబిసిటీ, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి, ప్రోటీన్స్ మినరల్స్, న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉండే చికెన్, పాలు, తేనె, గుడ్లు, చేపలు, బీన్స్, పాస్తా, బ్రోకలీ, పెరుగు, వెన్న, స్పినాచ్, మామిడి, సాల్మన్ ఫిష్ ఆహారాలను ఇవ్వాలి.

గమనిక :  వీలైనంత వరకు చక్కెర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తక్కువగా ఇవ్వడం చేస్తుండాలి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

సంవత్సరంలోపు పిల్లలకు అస్సలు తినిపించకూడని 5 ఆహారాలు

Leave a Reply

%d bloggers like this: