పిల్లలు నడవటం, మాట్లాడటం ఏ వయస్సు నుండి మొదలుపెట్టాలి?

పిల్లలు పుట్టిన తర్వాత వారు త్వరగా నడిస్తే చూడాలని, ముద్దు ముద్దుగా మాట్లాడితే వినాలని ప్రతి తల్లితండ్రులు చాలా ఇష్టంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇద్దరు పిల్లలు ఒకేసారి జన్మించినా లేదా ఒకే ఇంటివారైనా సరే ఒకటే సమయానికి నడవటం, మాట్లాడటం చేయలేరు. వారి శరీర, మెదడు అభివృద్ధిపై  ఇవి ఆధారపడి ఉంటాయి. అందుకు ఆందోళన అవసరం లేదు. ఐతే సాధారణంగా పిల్లలు ఎప్పుడు ప్రాకడం చేస్తారు. ఏ వయస్సు నుండి నడవటం, మాట్లాడటం చేస్తారో తెలుసుకుందాం…

ప్రాకటం

పసితనంలో పిల్లలందరూ ఒకే విధంగా ప్రాకటం చేయలేరు. వారికి సులువైన పద్ధతినే ఎంచుకుంటారు. చాలామంది చేతులు మరియు మోకాళ్లపై ఎక్కువగా ప్రాకటం చేస్తే, మరికొందరు మోకాళ్ళపై కాకుండా చేతులు మరియు పాదాలపైనే ముందుకు కదులుతూ ఉంటారు. ఇంకొందరు ఫ్లోర్ పట్టుకుని ఈత కొడుతున్నట్లు ప్రాకుతుంటారు.కొందరు ప్రాకటానికి ఇబ్బందిపడుతూ ముందుకు వెనక్కు కదులుతూ ఉంటారు. 6 నుండి 10 నెలలలోపు ప్రాకటం మొదలుపెడతారు.  ఎందుకంటే 6 నెలల వరకు ఎక్కువ నిద్రలోనే గడుపుతుంటారు. మీ పిల్లలు ఒక సంవత్సరం తర్వాత ప్రాకకుండా ఉంటే డాక్టర్ ను కలవండి.

నడవటం

50 శాతం మంది పిల్లలు 9 నుండి 16 నెలలలో నడవటం చేస్తుంటారు. మిగతా 50 శాతం మంది 12 నెలల వయసప్పుడు నడుస్తుంటారు. పిల్లలకు నడవాలని చాలా ఆతృతగా ఉంటారు. అందుకే గోడలు పట్టుకుని నడవటం, కుర్చీలు పట్టుకోవడం, మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం చేస్తుంటారు. కొంతమంది రెండు అడుగులు వేయగానే పడిపోతూ ఉంటారు. త్వరగా నడిచే పిల్లలు ఇతరులను నడిపించగలరని,  ఆలస్యంగా నడవటం మొదలుపెట్టేవారు చాలా జాగ్రత్తగా ఆలోచించే వ్యక్తిత్వం అని చెబుతున్నారు.

మాట్లాడటం

ప్రాకటం, నడవటం కన్నా మాట్లాడటానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. 12 నెలలు ఉన్నప్పుడు అమ్మ, నాన్న, మామ ఇలా రెండు మాటలు మాట్లాడగలరు. అది కూడా పేరెంట్స్ మాత్రమే గుర్తించగలరు. 18 నెలలప్పుడు 5 నుండి 20 పదాలు మాట్లాడతారు.1 నుండి 2 సంవత్సరాల అప్పుడు రెండు వ్యాఖ్యాలు, 3 నుండి 4 ఏళ్ళ వయసప్పుడు ఒక వెయ్యి పదాల వరకు మాట్లాడగలరు. అలాగే 12 నెలలప్పుడు కొన్ని సైగలు చేస్తుంటారు. బై బై అని చెప్పడం, చేతులు ఊపడం లాంటివి. 2 ఏళ్ళ వరకు పిల్లలు మాట్లాడేవి అర్థం కాకపోయినా ఒక్క తల్లి మాత్రమే బాగా అర్థం చేసుకోగలదు.

భయపడకండి

పిల్లలు ప్రాకటం మొదలుపెట్టినప్పుడు లేదా నడవటం చేస్తున్నప్పుడు వారికి కావాల్సిన శక్తిలేక భయం కారణంగా పడిపోతూ ఉంటారు. అలాగే మాట్లాడటానికి చిన్న వయసులో ప్రయత్నం చేస్తుంటారు. నడవలేక పడిపోతే, మాట్లాడలేక ఉండిపోతే మీరేం కంగారు పడకండి. మరీ ఇబ్బందిగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలన్నా, ఏవైనా అపోహలు ఉంటే ఆ ఆర్టికల్ SHARE చేసి, మాకు COMMENT చేయండి.

ఇవి కూడా చదవండి.

మీ భర్త మీ పిల్లలతో ఎలా ఉండాలి? ఆశ్చర్యపరిచే నిజాలు

Leave a Reply

%d bloggers like this: