మీ భర్తలో ఈ 6 లక్షణాలు ఉంటే మంచి మొగుడు మాత్రమే కాదు మంచి తండ్రి అవుతాడు కూడా..

ప్రతి దంపతులు నేను నా భార్య, నేను మా వారు పెర్ఫెక్ట్ కపుల్స్ కాదా? అవునా ? తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. మగవారి సంగతి  కాసేపు పక్కన పెడితే  మహిళలు మాత్రం తమ భర్త పర్ఫెక్ట్ మొగుడు, పర్ఫెక్ట్ తండ్రి అని ఈ లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు. ఎలాగో మీరే చూడండి. తప్పకుండా మీ శ్రీవారికి SHARE చేయండి.

ప్రేమ

మీ ఆయనకు బయట సవాలక్షా సమస్యలు ఉండవచ్చు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రేమగా పలకరించి మీతో ఆప్యాయంగా మాట్లాడుతుంటే మీ ఆయన మంచి మొగుడు అని గుర్తించండి. ఎందుకంటే తన బాధలు మీకు ఇబ్బంది కాకూడదని అనుకుంటాడు.

కేరింగ్

పెళ్లి అయిన సంవత్సరం , రెండేళ్ళు మూడేళ్ళు ఇలా కొత్తలో మాత్రమే కాదు ఎక్కడ ఉన్నా ఎంత బిజీలో ఉన్నా నా భార్య ఏం చేస్తూ ఉందో, ఎలా ఉందో అంటూ ఆఫీస్ కు వెళ్ళిన తర్వాత ఫోన్ చేయడం, ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండూ కేరింగ్ తీసుకోవడం భర్తకు ఉండాల్సిన రెండవ లక్షణం .

పిల్లలతో సరదాగా

ఈ ఉరుకు పరుగుల జీవితంలో టెన్షన్స్ లేనివి ఎవరికి చెప్పండి. ఎన్ని టెన్షన్స్ పడ్డా, ఎంత సంపాదించినా అంతా మీ పిల్లల కోసమే కదా . అలా మీ ఆయన మీ పిల్లలతో రోజు ఒక గంట వారితో గడపడం, వారితో ఆడుకోవడం, సరదాగా మాట్లాడటం చేస్తే తండ్రితో పిల్లలకు మంచి అనుబంధం ఏర్పడుతుంది.

విహారయాత్రలు

ఎప్పుడు వంటిల్లు, పిల్లల బాధ్యతతో మీకు బోర్ కొట్టి ఉంటుంది, అలాగే మీ పిల్లలు కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనుకుంటూ ఉంటారు కాబట్టి మీ ఆయన మిమ్మల్ని నెలకు ఒకసారైనా సినిమాకు లేదా ఏదైనా కొత్త ప్రదేశాలకు తీసుకెళ్తే పర్ఫెక్ట్ మొగుడే కాదు బెస్ట్ ఫాదర్ కూడా అవుతాడు .

ఓదార్పు

కావాల్సిన వారు ఇష్టమైన వారు కష్టాలు లేదా బాధల్లో ఉంటే వారి కళ్ళను బట్టే తెలుసుకోవచ్చు అంటారు .అలాంటిది మీ ఆయన జీవితంలో సగభాగమైన మీకు ఏ కష్టం వచ్చినా ఓదార్పు ఇవ్వడం, అండగా నిలబడం, ధైర్యాన్ని ఇవ్వడం భర్తకు ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ.

నవ్విస్తూ ఉండటం

ఇల్లంటే ఆఫీస్ కాదు కదా ఎప్పుడు సీరియస్ గా పనిచేస్తూ ఉండటానికి. అలాగే మీ కుటుంబంలో ఉన్నది వేరెవరో కాదు కదా.. అందుకే మీ ఆయనలో ఈ క్వాలిటీ ఉండేలా మీరే చూసుకోవాలి.మిమ్మల్ని మీ పిల్లలను ఎప్పుడు నవ్విస్తూ ఉండటం చేయాలి. ఈ లక్షణాలు ఉంటే మీ ఆయన పర్ఫెక్ట్ మొగుడు మరియు బెస్ట్ ఫాదర్ అవుతారు.

మీ ఆయన మీకు పర్ఫెక్ట్ మొగుడు, మీ పిల్లలకు  మంచి తండ్రి అయితే మీ ఆయనకు తెలిసేలా SHARE చేయండి. 

Leave a Reply

%d bloggers like this: