ఒకేసారి రెండుసార్లు గర్భవతి అయిన మహిళ : అరుదైన సంఘటన, అసలేం జరిగిందంటే..

మీరు చదివింది నిజమే!! అమెరికాలోని ఒక మహిళ తను ప్రేగ్నన్ట్ గా ఉండగానే మళ్ళి ప్రేగ్నన్ట్ అయ్యింది. కవలలకు జన్మనిచ్చింది. ఈ ఆశ్చర్యపరిచే సంఘటన గురించి ఈ మధ్యే అందరికి తెలిసింది.

అసలు ఏమి జరిగింది?

అమెరికాలోని కాలిఫోర్నియాలో 31 ఏళ్ళ జెస్సికా అలెన్ అనే మహిళ, ఒక చైనా దంపతులకు, సర్రోగేసీ ద్వారా వారి బిడ్డకు జన్మనివ్వడానికి అంగీకరించింది. అంటే విట్రో ఫెర్టిలైజషన్ ద్వారా, ఆ దంపతుల వీర్యకణం అండంతో ఏర్పడిన పిండాన్ని మహిళ గర్భంలోకి ప్రవేశింప చేస్తారు. అయితే ఇది జరిగిన 6 వారాలకు తన కడుపులో పెరుగుతుంది కవలలని అల్ట్రా సౌండ్ టెస్టుల ద్వారా తెలిసింది. ఈ విషయం తెలిసిన చైనా దంపతులు చాలా సంతోషించారు. 9 నెలల తర్వాత పండంటి కవలలకు జన్మనిచ్చి, చైనా దంపతులకు అందిచ్చింది.

అయితే సరిగ్గా 1 నెల తరువాత, చైనా దంపతుల నుండి, జెస్సికా కు పిల్లల ఫోటో వచ్చింది. దాని పై ఇలా రాసి వుంది… “ ఈ ఇద్దరు కవలలు ఒకేలా లేరు…. ఇందులో ఒకరు మాత్రమే మా బిడ్డ… ఈ రెండో బిడ్డ ఎవరు?”. అసలు విషయం తెలుసుకోడానికి డాక్టర్ కలిసిన తరువాత తెలిసినది ఏంటంటే… ఆ ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ, జెస్సికాకు తన భర్తకు పుట్టిన బిడ్డ. అంటే తను ప్రెగ్నన్సీ తో ఉండగా మళ్ళి ప్రేగ్నన్ట్ అయ్యింది అని డాక్టర్లు తెల్చి చేప్పారు.

ఎలా జరిగింది?

డాక్టర్ల వివరణ ప్రకారం, ప్రెగ్నన్సీ తో ఉండగానే మళ్ళి ప్రేగ్నన్ట్ అవ్వడం అనే ఈ అరుదైన ప్రక్రియకు కారణం, సూపర్ ఫీటేషన్ (superfetation). సహజంగా ప్రేగన్సీ తో ఉన్నప్పుడు, పీరియడ్స్ రావు, అందం విడుదల జరగదు. కానీ జెస్సికా విషయంలో అలా జరగలేదు, తన గర్భంలోకి పిండాన్ని ప్రవేశింప చేసిన తరువాత, తన భర్తతో సెక్స్ లో పాల్గొన్న సమయంలో అండం విడుదలయ్యి తను మళ్ళి ప్రేగ్నన్ట్ అయ్యింది. కొన్ని సర్దుబాటుల తర్వాత జెస్సికా తన బిడ్డను దక్కిన్చుకుంది. 

తన బిడ్డతో జెస్సికా…..

అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కనే సర్రోగేసీ (surrogacy) పద్దతి మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఆచరణీయమేనా… మీ అభిప్రాయాన్ని మాకు comments లో తెలియచేయండి. 

Leave a Reply

%d bloggers like this: