కడుపులోని బిడ్డ ఆడ లేదా మగగా ఎప్పుడు ఎలా మారతారో చూడండి. డాక్టర్లు కూడా చెప్పని విషయాలు

కడుపులో ఉన్న శిశువు మగ బిడ్డ లేదా ఆడ పిల్ల అని తెలుసుకోవడానికి శాస్త్రీయ పద్ధతులు, మన పెద్దలు ఎప్పటి  నుండో ఫాలో అవుతున్న విషయాలు ఉన్నాయి. కానీ మానవులలో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది? అంటే కడుపులో బిడ్డ మగ లేదా ఆడ బిడ్డగా ఎప్పుడు మారతారు? ఎలా మారతారు? అని చాలామందికి ఉన్న అనుమానం. ఇక్కడ వివరంగా ఆ విషయం చెప్పడం జరిగింది. తప్పకుండా తెలుసుకోండి.

మగ – ఆడ లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది?

సైన్స్ ప్రకారం మానవ శరీరంలో XX – XY అనే రకం క్రోమోజోముల ద్వారా లింగ నిర్ధారణ జరుగుతుంది. మానవ శరీరంలోని కారియోటైప్ లో మొత్తం 23 క్రోమోజోములు ఉంటాయి. వీటిలో దైహిక క్రోమోజోములు 22 అని, ఒక జత మాత్రం లైంగిక క్రోమోజోములు. కానీ పురుష,మహిళల శరీరంలో దైహిక క్రోమోజోములు ఒకే విధంగా ఉంటాయి. ఐతే లైంగిక క్రోమోజోములు మాత్రం విభిన్నంగా ఉంటాయి. ఎలా అంటే మగవారిలో X, Y (XY) క్రోమోజోములుగా, మహిళలలో X,X (XX) క్రోమోజోములుగా ఉంటాయి. పురుషులలో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు సగం X క్రోమోజోములుగా, మిగతా సగం Y క్రోమోజోములు, కానీ స్త్రీలు మాత్రం ఒకే రకం (X) అండకణాలను ఉత్పత్తి చేస్తారు. ఎప్పుడైతే అండకణాలు X శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే ఆడ పిల్లగా, అండకణాలు Y శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే మగ బిడ్డగా మారుతారు. మొత్తానికి మగవారికి శుక్రకణాలపై మానవుల లింగ నిర్ధారణ ఆధారపడి ఉంది.

లింగ నిర్ధారణ ఎప్పుడు తెలుస్తుంది?

సాధారణంగా గర్భం దాల్చిన మహిళ కడుపులో ఉన్న శిశువు మగ లేదా ఆడ బిడ్డ  అనేది 19 లేదా 20 వ వారంలో తెలుస్తుంది. కడుపులోని బిడ్డ ఆరవ వారం నుండి ఎదుగుదల, అవయవాలలో చిన్న చిన్న మార్పులు వస్తుంటాయి. 9 వ వారంలో మగ, ఆడ లింగ నిర్ధారణ అవయవాలు అభివృద్ధి జరుగుతుంది. 20 వ వారానికి వచ్చేసరికి పూర్తిగా వారి లింగ నిర్ధారణకు సంబంధించిన అవయవాలు ఏర్పడటం జరుగుతుంది.

ఈ విషయాలు సైన్స్ ప్రకారం వెల్లడి చేయబడినవి. అందరూ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి SHARE చేయండి. 

Leave a Reply

%d bloggers like this: