గర్భంతో ఉన్నప్పుడు తమకు తెలియకుండానే మహిళలు చేస్తున్న 7 తప్పులు : ఇవి బిడ్డకు ప్రమాదం

గర్భం దాల్చడం, బిడ్డకు జన్మను ఇవ్వడం అనేది మహిళకు పునర్జన్మ లాంటిది. అలాగే బిడ్డకు జన్మను ఇవ్వడంతోనే సంపూర్ణ మహిళ అనే ఆనందాన్ని పొందుతుంది. ఐతే ప్రెగ్నన్సీ సమయంలో చాలామంది మహిళలు తమకు తెలిసో,, తెలియకనో ఈ తప్పులు చేయడం వలన వారితో పాటు వారికి పుట్టబోయే బిడ్డపైనా ప్రభావం చూపుతుంది. అందుకని ఈ విషయాలు మీరు తెలుసుకుని తెలియని వారికి తెలిసేలా SHARE చేయండి. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారమే బిడ్డను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ఆహారం తీసుకోవడానికి ఎక్కువ విరామం

ప్రెగ్నన్సీతో ఉన్న మహిళలు చేస్తున్న అతి పెద్ద తప్పులలో ఇదే మొదటిది. సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం. గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువ ఒకేసారి తినలేకపోవచ్చు. అందుకని రోజుకి కనీసం 5 సార్లు కొద్దిమొత్తంలోనైనా తీసుకోవాలి.  అంతేకాకుండా పోషకాహారం ఉండేలా చూసుకోవాలి.

కాఫీ ఎక్కువగా తీసుకోవడం

గర్భం సమయంలోనే కాకుండా సాధారణంగానే కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీలకు దూరంగా ఉండమని చెబుతున్నారు వైద్యులు. ఇక ముఖ్యంగా గర్భంతో ఉన్నప్పుడు కాఫీ తీసుకోవడం కడుపులో బిడ్డకు మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి బదులుగా ఆరోగ్యానికి మంచి చేసే గ్రీన్ టీ, లెమన్ టీ సేవించడం ఉత్తమం.

నీరు ఎక్కువగా తీసుకోకపోవడం

నీరు రోజులో ఎంత ఎక్కువ మోతాదులో తీసుకుంటే అంత మంచిదని, ముఖ్యంగా ప్రగ్నన్సీ సమయంలో ఎక్కువ నీటిని తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే గర్భిణీలకు వికారంగా ఉండటం వలన నీటిని తీసుకోవడానికి ఇష్టపడరు. ఈ విషయాలను పక్కన పెట్టేసి నీరు ఎక్కువగా తీసుకోవడం చేయాలి.

నిద్రకు దూరంగా ఉండటం

చాలామంది బిడ్డకు జన్మను ఇచ్చే సమయంలోనే ఎక్కువ నిద్ర మరియు విశ్రాంతిను కోరుకుంటూ ఉంటారు. మీతో పాటు మీ గర్భంలో శిశువు ఉందని మర్చిపోకుండా మంచి నిద్ర విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే ఉల్లాసంగా చైతన్యవంతంగా ఉండగలరు.

ధూమపానం మద్యపానం

గర్భంతో ఉన్న మహిళలకు ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ ఈ సమయంలో వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ కడుపులోని బిడ్డపైనా ప్రభావాన్ని చూపెడుతుంది. అలాగే ధూమపానం చేసే వారి పక్కన ఉండకూడదు. చాలామందికి ఈ విషయాన్ని చాలా ఈజీగా వదిలేస్తున్నారు.

ఏదో పోగొట్టుకున్న వారిలా ఉండటం

మీ కడుపులో ఒక బిడ్డ పెరుగుతోంది, ఈ ప్రపంచంలోకి ఒక ప్రాణాన్ని తీసుకువస్తున్నారు అంటే ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత ఆక్టివ్ గా ఉండాలి. జీవితంలో ఏదో పోగొట్టుకున్న వారిలా ఉండకుండా ప్రతి రోజూ గర్భిణీ స్త్రీలు చేయాల్సిన వ్యాయామాలు, యోగా, ధ్యానం చేయడం వలన మీ మనసు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తుంది.

మీ కోరికలకు తగ్గట్లు

ప్రెగ్నన్సీ సమయంలో మీకు ఇష్టమైన పిజ్జా, బర్గర్, జంక్ ఫుడ్స్ తినాలని ప్రతి ఒక్కరికీ కలగడం సహజమే, అందుకే అల్పాహారంగా వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక 9 నెలల వరకు మీ బిడ్డ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టేంత వరకు  వీటికి దూరంగా ఉండే మీ బిడ్డకు మంచి జీవితాన్ని ఇచ్చిన వారవుతారు.

ఇక్కడ చెప్పుకున్న ఈ విషయాలు నిజమే, గర్భిణీ మహిళలకు ఉపయోగకరమని మీకు అనిపిస్తే SHARE చేయగలరు.    

Leave a Reply

%d bloggers like this: