పిల్లలకు సున్నిపిండిని ఎలా ఉపయోగించాలి? ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన 5 ఉపయోగాలు

తమ పిల్లలు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. అయితే చిన్న పిల్లలకు ఎలా స్నానం చేయించాలి, వారు అందంగా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు చాలా తక్కువమంది చెబుతుంటారు. పిల్లలకు చర్మ వ్యాధులు రాకుండా వారిని అందంగా ఉంచే  పదార్థం సున్నిపిండి. మరి ఈ సున్నిపిండిని పిల్లలకు ఎలా ఉపయోగించాలో మీరే తెలుసుకోండి.

సున్నిపిండి స్నానం

పిల్లలకు రోజుకి రెండుసార్లు చేయించడం మంచిది. స్నానం చేయించే ముందు స్వచ్ఛమైన కొబ్బరినూనె లేదా నువ్వులనూనెను పిల్లల శరీరం రాసి మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలోకి సున్నిపిండి తీసుకుని అందులో కాస్త నీళ్లు లేదా పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని పిల్లల శరీరంపై మెత్తగా రాసి ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయిస్తే చాలు. ఎటువంటి సబ్బులు అవసరం లేదు.

పిల్లల చర్మంపై వెంట్రుకలు

సంవత్సరంలోపు పిల్లల చర్మంపై వెంట్రుకలు ఉండటం సాధారణమే. అయితే ఇలా ఎక్కువగా ఉన్నాయని పిల్లల చర్మంపై సున్నిపిండి వేసి ఎక్కువగా రుద్దటం చేస్తుంటారు. ఇలా చేయడం వలన వారి చర్మంపై రంధ్రాలు పడి మంట, దద్దుర్లు వస్తాయి. వెంట్రుకలు సహజంగానే ఊడిపోతాయి కాబట్టి దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

కఫాన్ని అదుపులో ఉంచుతుంది

పిల్లలలో జలుబు, కఫం సహజంగానే కాస్త ఎక్కువగా ఉంటాయి. కఫం కంట్రోల్ లో ఉండాలంటే స్వచ్ఛమైన కొబ్బరినూనెను తీసుకుని శరీరం అంతా మాలీష్ చేయాలి. ముఖ్యంగా కఫం ఎక్కువగా ఉండే తల, చెవుల భాగాలలో బాగా మాలిష్ చేసి సున్నిపిండితో సున్నితంగా మసాజ్ చేసి స్నానం చేయించడం వలన కఫం అదుపులో ఉంటుంది.

పిల్లల రంగు గురించి చింతించకండి

తమ పిల్లలు అందంగా లేరని చాలామంది తల్లులు బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు సున్నిపిండిలో పాలు లేదా తేనె కలిపి స్నానానికి ముందు రాసి మర్దనా చేయడం వలన బాహ్యమూలాలలో రాయడం వలన అక్కడ ఉన్న మురికి దూరం అవుతుంది. పిల్లలు అందంగా ఉంటారు అలాగే పెసరపిండిలో కాస్త బియ్యపు పిండి కలిపి ఇందులో పాలు లేదా తేనె కలిపి శరీరంపై రాసి మసాజ్ చేసి స్నానం చేయిస్తే మంచి ఫలితం ఉంటుంది.

సున్నిపిండి ఎలా తయారు చేసుకోవాలి?

మన పెద్దలు ఇప్పటికీ సబ్బులు వాడకుండా సున్నిపిండిని ఉపయోగిస్తున్నారంటే దీనివలన కలిగే ఉపయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా పెసర, బియ్యం, శనగపప్పును సమానంగా తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కాస్త పసుపు మరియు ముల్తాన్ మట్టి కలుపుకోవాలి. ఆ తర్వాత మెంతి ఆకులు, తమలపాకులు, వేపాకులు, గులాబీ రేకులను ఎండబెట్టి పొడిగా చేసుకుని పై మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ పిండిని నిల్వ ఉంచుకోవచ్చు.  స్నానానికి ముందు అందులో నీరు, పాలు లేదా తేనె కలిపి చర్మంపై రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వలన చర్మం పొడిబారదు మరియు చర్మంపై సూక్ష్మక్రిములు చేరకుండా చేసి మొటిమలు రాకుండా నివారిస్తుంది. ముఖం కాంతివంతంగా ఉండేలా సహాయపడుతుంది.

ముఖ్య గమనిక : కొందరు పిల్లలకు సున్నిపిండి వలన రాషెష్ వస్తుంటాయి కాబట్టి వారికి పడకపోతే వాడకపోవడం మంచిది.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే, అందరికీ ఉపయోగపడే విషయం అని మీకు అనిపిస్తే వెంటనే LIKE మరియు SHARE చేయండి.  అలాగే మీ COMMENT కూడా తెలుపవచ్చు. 

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: