పీరియడ్స్ ఆలస్యం కావడానికి కారణాలు : మహిళలకు ఎవ్వరూ చెప్పని అసలు నిజం

మహిళలను ప్రతి నెల బాధించే సమస్య రుతుక్రమం. కొన్ని సార్లు అనుకున్న సమయానికి కంటే పీరియడ్స్ రావడం, మరికొన్ని సార్లు రోజులు గడుస్తున్నా రుతుక్రమం జరగకపోవడం చాలా ఇబ్బందికి గురి చేస్తుంటాయి. ఐతే చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి కారణం? ఇక్కడ వివరంగా ఈ విషయం గురించి చెప్పడం జరిగింది.

రక్తహీనత

మహిళలలో వయస్సు పైబడే కొద్దీ రక్తహీనత కారణంగా కొన్ని సార్లు రుతుక్రమం ఆలస్యంగా జరగడం మరియు  ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు తీసుకునే ఆహారం సరైనది కాకపోవడం అంటే మంచి పోషకాహారానికి దూరంగా ఉన్నారని అర్థం. 

ఒత్తిడి ఆందోళన

మగవారితో పోల్చితే మహిళలలోనే ఒత్తిడి ఆందోళన ఎక్కువని చెబుతున్నారు. ప్రతి విషయానికి ఎక్కువ ఒత్తిడికి గురవడం వలన అది పీరియడ్స్ పై ప్రభావం చూపెడుతుంది. ఫలితంగా పీరియడ్స్ ఆలస్యంగా రావడం జరుగుతుంది. ఎక్కువ టెన్షన్ పడటం వలన హార్మోన్స్ తగ్గిపోయి రుతుక్రమం ఆలస్యమవుతుంది.

అనారోగ్యం బారిన పడినప్పుడు

కొన్నిసార్లు అనారోగ్యం బాగోలేనప్పుడు, దీర్ఘకాలిక జబ్బుల కారణంగా పీరియడ్స్ ఆలస్యంగా వస్తుంటాయి. ఎప్పుడైనా ఇలా జరిగితే ఫర్వాలేదు కానీ ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. లేదా కొన్ని ఆయుర్వేద మందులు ఉన్నాయి. వాటిని వాడటం మంచిదే.

బరువులో మార్పులు

ఉన్నట్లుండి బరువు పెరగడం లేదా బరువు తగ్గడం వలన శరీరంలోని హార్మోన్లలలో అసమతుల్యత ఏర్పడి అది పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి కారణమవుతుంది. మళ్ళీ మీ బరువు సాధారణ స్థాయికి రాగానే పీరియడ్స్ సక్రమంగా కావడం జరుగుతుంది.

ఒకే మందులు వాడినప్పుడు

ఎప్పుడు ఒకే మందులు లేదా మందులు తరచూ వాడటం వలన రుతుక్రమం ఆలస్యం అవుతుంది. అందుకని ఎప్పుడు మందులు వాడేవారు దీనికి పరిష్కారం ఏంటో మీ వైద్యుడే చెబుతాడు. ఎందుకంటే రుతుక్రమం సరిగ్గా సరైన సమయానికి జరగకపోతే మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

ప్రెగ్నన్సీ కూడా కారణమే

గర్భం దాల్చినప్పుడు అది పీరియడ్స్ పై ప్రభావం చూపెడుతుందనేది నిజమే. ఐతే ఈ విషయం చాలామందికి తెలియక పీరియడ్స్ రావడం లేదు, రుతుక్రమం ఆగిపోయిందని అనుమానంతో ఆందోళన పడుతుంటారు. గర్భధారణ పరీక్ష ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు.

రుతుక్రమం సరిగ్గా జరగాలంటే

పీరియడ్స్ ఆలస్యం కాకుండా ఉండటానికి పుదీనాను మెత్తగా చేసుకుని ఒక స్పూన్ తేనెతో రోజుకి రెండు సార్లు తినడం చేయాలి. నువ్వులు తినడం వలన రుతుక్రమం ఆలస్యం కాకుండా చేస్తుంది. అలాగే ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్ మరియు సాల్మన్ ఫిష్ కూడా బాగానే ఉపయోగపడుతుంది. 

మహిళలను వేధించే ఈ సమస్య గురించి అందరికీ అర్థమయ్యేలా SHARE చేయండి.

Leave a Reply

%d bloggers like this: