ప్రెగ్నన్సీ తరువాత వక్షోజాలు జారిపోకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన 5 పనులు

ప్రెగ్నన్సీ తరువాత మీ శరీరరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని మార్పులు మీ శరీర ఆకృతిని పూర్తిగా మార్చేస్తాయి. ఆ మార్పులలో ప్రధానమైనది మీ వక్షోజాలు జారిపోవడం. ప్రెగ్నన్సీ తరువాత అనేక కారణాల వలన వక్షోజాలు జారిపోవడం మొదలవుతుంది, ముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే, వాటిని జారిపోకుండా ఆపచ్చూ. అందుకు మీరు చేయాల్సిన పనులు ఇవే…

వక్షోజాలు జారిపోవడం ఎందుకు జరుగుతుంది?

ప్రెగ్నన్సీ తరువాత బిడ్డకు పాలు ఇవ్వడం వలన, వక్షోజాలు జారిపోతాయి అని చాలా మంది అనుకుంటారు. కానీ వక్షోజాలు జారిపోడానికి అదొక్కటే కారణం కాదు. మీరు ప్రేగ్నన్ట్ అయినప్పుడు అధిక హార్మోన్ల ఉత్పత్తి వలన, వక్షోజాలు బరువుపెరుగుతాయి. ఈ వత్తిడి ఛాతి లిగ్మెంట్స్ సాగిపోడానికి కారణమవుతుంది. ఫలితంగా వక్షోజాలు జారిపోవడం మొదలవుతుంది.

వక్షోజాలు జారిపోకుండా ఉండడానికి చేయాల్సిన పనులు….

1. సరైన బ్రా ను ధరించండి

మీరు వక్షోజాల సైజు కంటే ఎక్కువ లేదా తక్కువ సైజు బ్రా ను ధరించడం మంచిది కాదు. మీ సరిపోయే సరైన ఫిట్ బ్రా ను ధరించదానికి ప్రయత్నించండి. బ్రా తీసుకునే ముందు మీ కరెక్ట్ సైజు ఏంటో తెలుసుకోండి. కప్ సైజు మీకు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. సరైన ఫిట్ బ్రా వేసుకోవడం వలన మీ వక్షోజాలు జారిపోకుండా ఉంటాయి.

2. అధిక బరువు వద్దు

ప్రెగ్నన్సీ సమయంలో బరువు పెరగడం సహజంగా జరుగుతుంది. ప్రెగ్నన్సీ సమయంలో 10-15 కేజీల వరకు బరువు పెరగడం సాధారణమే. ప్రెగ్నన్సీ తరువాత వ్యాయామం, ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకుని బరువు తగ్గడానికి ప్రయత్నించండి. అధిక బరువు వలన వక్షోజాలు జారిపోయే ప్రమాదం ఉంటుంది.

3. వ్యాయామం

ప్రెగ్నన్సీ తరువాత వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ముందుగా నడవడం, స్ట్రేటచెస్ లాంటి తేలిక పాటి వ్యాయామాలతో మొదలుపెట్టండి. ఇవి మీ శరీరంలో కొవ్వును తగ్గించడం వలన మీ బరువు అదుపులో ఉంటుంది. వక్షోజాలు జారిపోకుండా ఉంటాయి.

4. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి

ప్రెగ్నన్సీ తరువాత మీ చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రాటెడ్ గా వుంచుకోడానికి ప్రయత్నించండి. మొయిస్ట్ ట్రైజెర్ వాడండి.ముఖ్యంగా వక్షోజాలకు వాడండి. చర్మం బిగుతుగా ఉండడం వలన వక్షోజాలు జారిపోవు.

5. బరువు నిదానంగా తగ్గాలి

ప్రెగ్నన్సీ తరువాత బరువు తగ్గాలనుకున్నప్పుడు, నిదానంగా తగ్గించుకోడానికి ప్రయత్నించండి.  వెంటనే బరువు తగ్గడం వలన చర్మం వదులవుతుంది. వక్షోజాలు జారిపోయే అవకాశం ఉంటుంది. 

Leave a Reply

%d bloggers like this: