బిడ్డకు పాలిచ్చే సమయంలో ఫోన్ వాడడం మంచిదేనా?

తల్లి బిడ్డ కోసం చేయాల్సిన పనులలో బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ముఖ్యమైనది. మీ బిడ్డ శరీర ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు, బిడ్డకు తల్లి పాల నుండే అందుతాయి. అయితే పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో మీరు ఏమి చేయాలి? చాలా మంది తల్లులు బిడ్డకు పాలు ఇస్తూ, మొబైల్ వాడుతుంటారు. ఇలా చేయడం పిల్లలకు ప్రమాదమని, డాక్టర్ లు చెప్తున్నారు. అందుకు కారణాలు ఇవే..

1. కంటి చూపు

తల్లి బిడ్డ మధ్య బంధం ఏర్పడడానికి, మొదట చూపులు కలవాలి. బిడ్డ పుట్టిన తర్వాత కొంత కాలం వరకు, బిడ్డ కేవలం అమ్మ ముఖాన్ని, పాలిచ్చే సమయంలో రొమ్ములను మాత్రమే చూడగలడు. మిమ్మల్ని గుర్తు పట్టగలడు. అయితే మీరు పాలిచ్చే సమయంలో చూపు బిడ్డ వైపు ఉంచకుండా,మొబైల్ చూడడం వలన, మీ మధ్య బంధం ఏర్పడడం ఆలస్యమవుతుంది.

2. స్పర్శ

మీ చేతులలో మొబైల్ పట్టుకుని బిడ్డకు పాలు ఇవ్వడం వలన, బిడ్డ నిద్రపోయిన, పాలు తాగడం ఆపేసిన మీకు తెలియదు. అంతేకాకుండా బిడ్డ ఎంత పాలు తాగాడో మీరు తెలుసుకోలేరు.

3. పట్టించుకోకపోవడం

పిల్లలు ఎదుగుతున్న క్రమంలో, మీతో సంభాషించడానికి నవ్వడం చేతులు ఊపడం, మిమ్మల్ని తాకాలనుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. మీరు పాలిచ్చే సమయంలో మీ దృష్టి తన పై ఉండాలని, బిడ్డ కోరుకుంటాడు. మీరు అలా చేయకపోతే పిల్లలు మనసు గాయపడుతుంది.

4. అందుకోలేకపోవడం

బిడ్డకు కొన్ని రొమ్మును అందుకోవడం, పాలు తాగడం కష్టమవ్వచ్చు. ఆ సమయంలో తల్లి, బిడ్డకు వీలుగా రొమ్మును అందివ్వడం, పాలు తాగడం బిడ్డకు సులభమవ్వడానికి ప్రయత్నించాలి. మీరు ఒకవేళ పాలు ఇచ్చే సమయంలో మీరు మొబైల్ వాడుతువుంటే, ఇవన్నీ మీరు చేసే అవకాశం ఉండదు.

5. రేడియేషన్

పిల్లల శరీర నిర్మాణం చాలా సున్నితంగా ఉంటుంది.  మీరు వాడే మొబైల్ నుండి వచ్చే రేడియేషన్ వారి మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వారి శరీర మానసిక ఎదుగుదల దీని వలన ఆలస్యం కావచ్చు.

తల్లి పాలు బిడ్డకు అత్యంత అవసరం, అందుకే బిడ్డకు పాలిచ్చే సమయంలో మీ దృష్టి మొత్తాన్ని బిడ్డ మీదే ఉంచండి. మీ బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పాలతో పాటు, మీ మధ్య బంధాన్ని గట్టిపరుస్తుంది. మొబైల్ వాడడం మాత్రమే కాకుండా, టీవీ చూడడం, ఇతురలతో మాట్లాడడం లాంటివి చేయకండి.  

Leave a Reply

%d bloggers like this: