పిల్లలు ఆరోగ్యాంగా,బలంగా పుట్టాలని అందరూ తల్లితండ్రులు కోరుకుంటారు. శరీరం తో పాటు, పిల్లల చర్మం, రంగు కూడా ఆరోగ్యాంగా ఉండాలి. పిల్లల రంగు, తల్లి తండ్రుల జీన్స్ మీద ఆధారపడివున్నా, ప్రెగ్నన్సీ సమయంలో మీరు తీసుకునే ఆహరం కూడా కొంత ప్రభావం చూపిస్తుంది. పిల్లలు మంచి రంగుతో, ఆరోగ్యమైన చర్మం తో పుట్టాలంటే, ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే…
1. కుంకుమ పువ్వు పాలు
ప్రెగ్నన్సీ తో వున్నా చాలా మంది మహిళలు కుంకుమ పువ్వు పాలను తీసుకుంటుంటారు. అలా తీసుకోవడం చాలా మంచిది. మీకు కడుపులోని బిడ్డకు, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా కడుపులోని బిడ్డ రంగును కూడా పెంచుతుంది. అయితే కుంకుమ పువ్వును అధిక మోతాదులో తీసుకోకండి.
2. నెయ్యి
ప్రెగ్నన్సీ సమయంలో ఆహారంలో నెయ్యి తీసుకోవడం వలన. కాన్పు సులువుగా జరుగుతుంది. పిల్లల కూడా మంచి రంగుతో పుడతారు.
3. బాదాం
బాదాం కడుపులోని బిడ్డ రంగును పెంచుతుంది. ప్రెగ్నన్సీ సమయంలో, బాదాం ను నానబెట్టి, మెత్తగా రుబ్బి పాలలో కలుపుకుని తాగండి. మీ కడుపులోని బిడ్డకు మంచి రంగు వస్తుంది.
4. ద్రాక్ష రసం
ద్రాక్షలలో ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్స్ (AHD) అధికంగా ఉంటుంది. మీ ప్రెగ్నన్సీ సమయంలో రెండు రోజులకు ఒకసారి 60 మీలీ ద్రాక్ష రసం తీసుకుంటే, మీ పిల్లలు మంచి రంగుతో, ఆరోగ్యాంగా, బలంగా పుడుతారు.
5. ఆరెంజ్స్
అన్ని సిట్రస్ పండ్లలో కన్నా ఆరెంజ్స్ లో అధికంగా విటమిన్ ‘C’ ఉంటుంది. ఈ విటమిన్ C మీరు ప్రెగ్నన్సీ సమయంలో తీసుకోవడం వలన పిల్లల మంచి రంగుతో పుడుతారు.
6. పైన్ ఆపిల్
పైన్ ఆపిల్ లో కూడా విటమిన్ C అధికంగా ఉంటుంది. వారానికి ఒక సారి పైన్ ఆపిల్ జ్యూస్, మీరు ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు తీసుకోవడం వలన బిడ్డ మంచి రంగుతో పుడుతాడు.
7. సోంపు
ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు సోంపు తీసుకోవడం చాలా మంచిది. సోంపును నీళ్ళలో నానబెట్టి, ఆ నీళ్ళను ఉదయం లేవగానే, తాగడం వలన, వికారం తగ్గుతుంది. పిల్లల రంగు మీద కూడా ప్రభావం చూపిస్తుంది.
8. దానిమ్మ
దానిమ్మ ప్రెగ్నన్సీ సమయంలో తినడం వలన, మీ రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. దీని ద్వారా కడుపులోని బిడ్డ పిగ్మెంటేషన్ శాతం తగ్గుతుంది, మంచి రంగుతో పూడుతుంది.
ఇవి కూడా చదవండి
పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉండాలంటే తప్పకుండా తినిపించాల్సిన 7 ఆహారాలు