ప్రతి భార్య తన భర్తకు తప్పక చెప్పాల్సిన 10 రహస్యాలు

భార్యాభర్తల బంధం అందంగా ఉండటానికి, మరింత బలంగా ఉండటానికి భార్యల కోసం, భర్తల కోసం ప్రత్యేకంగా పుస్తకాలు లేవు, కోచింగ్ ఇచ్చే వారు లేరు.  తమ దాంపత్య జీవితాన్ని ఈ రంగుల ప్రపంచంలో ఎంత అందంగా ఉంచుకోగలరు అనేది భార్యలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.  అందుకే ఈ రహస్యాలను మీరు మీ భర్తతో తప్పక పంచుకోవాలి.

మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది

కొన్ని విషయాలను భార్యలు భర్తల దగ్గర అందరితో పాటు చెప్పుకోలేరు. వారు సాధించిన విజయాన్ని మాత్రం మర్చిపోకుండా, ఏదైనా గొప్ప పని చేసినప్పుడే కాకుండా అప్పుడప్పుడు మిమ్మల్ని భర్తగా పొందటం గర్వంగా ఉందని చెప్పాలి.

నమ్ముతాను, తోడుగా ఉంటాను, అభినందిస్తాను

పెళ్లి తర్వాత తెలియని ప్రపంచంలోకి ఆడవాళ్ళు వస్తారంటారనేది ఎంత నిజమో, మగవారు కూడా పని ఒత్తిడి, కుటుంబం కోసం అంటూ ఒంటరిగా అనే భావన కనిపిస్తుంది. అందుకే మీ వారు ఏ పని చేసినా అందుకు తోడుగా నేనుంటాను,  మిమ్మల్ని నేను నమ్ముతాననే నమ్మకం కల్పిస్తూ అభినందిస్తూ ఉండాలి.

మీ దగ్గర ఉంటే నాకు రక్షణగా ఉంటుంది

భార్యకు పెళ్లి తర్వాత అత్యంత నమ్మకస్తుడు భర్త మాత్రమే. అందుకే ప్రతి భార్య ఎప్పుడు తన భర్త పక్కనే ఉండాలని కోరుకుంటుంది. తన భర్త పక్కనే ఉంటే తనకు ఎటువంటి సమస్యలు ఉండవు, రక్షణగా ఉంటాడని భావిస్తుంది.

నన్ను క్షమించండి

కొన్నిసార్లు కోపంతోనో లేక చిరాకు వలనో మీ భర్తను మీరు అనరాని మాట అనటం లేదా చికాకు పడటం చేస్తున్నా మీ భర్త సర్దుకుని వెళ్తుంటారు.  అయితే అప్పుడే కాకపోయినా కొన్ని నిముషాల తర్వాత నన్ను క్షమించండి ప్లీజ్ అని అడగండి.

మీరు నాకు భర్త కావడం నా అదృష్టం

ప్రతి తల్లీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నపుడు ఈ మాట చెబుతుంటారు. అలా మాట వరసకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో మీ భర్త దొరకడం అదృష్టం అనే భావన ఖచ్చితంగా కలుగుతుంది. అప్పుడు వెంటనే ఈ మాటను చెప్పండి.

ఏమి ఆలోచిస్తున్నారు?

కొన్ని విషయాలు మీ భర్త ఎవరికీ చెప్పుకోలేక ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటుంటారు. అప్పుడు కాకపోయినా మీరు ఈ మధ్య దేని గురించో ఆలోచిస్తున్నారు నేను తెలుసుకోవచ్చా అని మెల్లగా అడగటం వలన మీ భర్తను బాగా అర్థం చేసుకున్నవాళ్ళవుతారు.

మీరు గొప్ప తండ్రి

మీ భర్త గురించి బయటివాళ్ళు మంచి భర్త, మంచి భర్త చెప్పినా, చెప్పకపోయినా ఏం కాదు కానీ, మీకు మంచి భర్త, మీ పిల్లలకు గొప్ప తండ్రి మీరు చాలా గర్వంగా చెబితే ఆయనకు కలిగే ఆనందాన్ని మీరు మాటల్లో చెప్పలేరు.

నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను

మీ భర్త ఏదైనా తప్పు చేసినప్పుడు మిమ్మల్ని ఏదైనా మాట అన్నప్పుడు తను రియలైజ్ అయి మీ దగ్గరకు వచ్చి స్వారీ బుజ్జి క్షమించు అనగానే వెంటనే ఓకే మిమ్మల్ని క్షమిస్తున్నాను అని చెప్పండి. దాంపత్యంలో ఎక్కువ దూరం ఉండకూడదు.

హమ్మయ్య మీరు ఇంట్లో ఉన్నారు నేను హ్యాపీ

తమ భర్తతో ఎక్కువ సమయం గడపాలని ప్రతి భార్య కోరుకుంటుంది. అయితే ఆఫీస్, బిజినెస్ అంటూ చాలామంది అక్కడే ఎక్కువగా గడుపుతూ ఉంటారు. అటువంటప్పుడు మీరు ఈ రోజు నాతో ఇంట్లో ఉండాల్సిందే అంటే ఖచ్చితంగా ఉండటానికి కన్నా మీ ఆనందం కోసం ఉంటారు.

ఐ లవ్యూ

చాలామంది పెళ్లి అయిన తర్వాత తమ భర్తలతో ఈ విధంగా చెబితే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ తప్పకుండా మీ ఫీలింగ్స్ ను ఇష్టాన్ని చెబుతూ ఉండాలి. మీ ప్రేమకు నేను బానిసను అని మీ ఆయనతో చెబితే ఆయన సంతోషమే వేరు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

పిల్లల పెంపకం: ఉమ్మడి కుటుంబం మరియు చిన్న కుటుంబంలోని తేడాలు

Leave a Reply

%d bloggers like this: