పీరియడ్ సమయంలో వచ్చే రక్తం రంగును బట్టి మహిళల ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు 😱😱

 

 

మహిళలలో ప్రతి నెలా ఎదురయ్యే సమస్య పీరియడ్స్. పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి, మంటగా, అలసటగా ఉండటం, రక్తస్రావం ఇబ్బంది పెడుతుంటాయి. అయితే పీరియడ్స్ సమయంలో వచ్చే రక్తాన్ని బట్టి మీ ఆరోగ్యం గురించి సులభంగా తెలుసుకోవచ్చు.

పీరియడ్ సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉన్నట్లయితే రక్తహీనతగా వెంటనే గుర్తించాలి. ఇలా జరగడం వలన గర్భధారణ సమయంలో  ఇబ్బందిగా ఉంటుంది.  అదే రక్తస్రావం తక్కువగా ఉంటే హార్మోన్ల అసమతుల్యతగా గుర్తించాలి. అలా రక్తం వివిధ రంగులలో ఉండటం వలన  మీ ఆరోగ్యం ఎలా ఉంటుందంటే..

పింక్ కలర్ లో రక్తస్రావం pinkish

పీరియడ్స్ సమయంలో రక్తం పింక్ కలర్ లో ఉన్నట్లయితే ఈస్ట్రోజన్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని గుర్తించాలి. ఈ రంగులో ఉండటం వలన సాధారణంగా కంటే రక్తస్రావం కొంచెం ఎక్కువగా ఉన్నట్లు. అతిగా వ్యాయామాలు చేయడం వలన, ఎక్కువ ఒత్తిడి చెందినప్పుడు ఈ విధంగా జరుగుతుంది.

నీటిధారలా వస్తుంటే watery

నీటిధారలా రక్తస్రావం జరుగుతుంటే ఎనీమియా మరియు హార్మోన్ల అసమతుల్యతగా గుర్తించాలి. తీసుకునే ఆహారం వలన ఈ విధంగా జరగడానికి కారణమవుతుంది. ఈ విధంగా జరుగుతుంది అంటే బహిష్టు సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని అర్థం. ఎప్పుడు పీరియడ్స్ సమయంలో ఇలా వేధిస్తుంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించడం చేయాలి.

ముదురు గోధుమ రంగులో dark brown

పీరియడ్స్ టైంలో రక్తం ముదురు గోధుమ రంగులో వస్తున్నట్లయితే ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయి విడుదలకావలసిన దాని కన్నా ఎక్కువ మోతాదులో విడుదల అవుతుందని గుర్తించాలి. ఇలా జరుగుతున్నప్పుడు రక్తం ఆగి ఆగి రావడం జరుగుతుంది. అయితే దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు కొన్ని రోజులలో ఇది సాధారణ స్థితిలోకి వస్తుంది.

ఎర్రగా గడ్డల రూపంలో వస్తుంటే jam colored

ఈ విధంగా వస్తుంటే ప్రొజెస్టిరాన్ లెవల్స్ తక్కువగా మరియు ఈస్ట్రోజన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని గుర్తించాలి. హార్మోన్ల అసమతుల్యత ఇలా జరగడానికి కారణం. సోయా, చక్కెర, పాడి పదార్థాలను తీసుకోవడం కొన్ని రోజుల పాటు తగ్గిస్తే వ్యత్యాసం మీకే తెలుస్తుంది.

బూడిద మరియు ఎరుపు రంగులో వస్తుంటే mix gray red

పీరియడ్స్ సమయంలో ఈ విధంగా జరుగుతుంటే ఇన్ఫెక్షన్స్ కారణంగా గుర్తించాలి. ఎస్ టీ డీ లేదా ఎస్ టీ ఐ కూడా కారణం కావచ్చు. గర్భధారణ సమయంలో ఇబ్బంది ఉండే పరిస్థితి కలుగుతుంది కాబట్టి ఇలా వస్తున్న వారు వైద్యులను వెంటనే సంప్రదించడం ఉత్తమం.

ప్రకాశవంతంగా ఎరుపు రంగులో ఉంటే cranberry

బహిష్టు సమయంలో రక్తం ప్రకాశవంతంగా ఎరుపు రంగులో ఉంటే మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారని, సరైన విధంగానే బహిష్టు జరుగుతుందని గుర్తించాలి.  హార్మోన్లు సమతుల్యంగా ఉండటం వలన ఇలా జరుగుతుంది కాబట్టి దీనిపై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన  అవసరం లేదు.

Leave a Reply

%d bloggers like this: