మీ జన్మ రాశిని బట్టి మీలో ఇతరులు ఏం అసూయ పడతారు?

పుట్టిన నెలను బట్టి, జన్మ రాశిని బట్టి, హస్త రేఖల ద్వారా భవిష్యత్ ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడం అనేది కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండే  మొదలైంది. ఇప్పుడు మనమేమీ కొత్తగా చేస్తున్నది కాదు, వాళ్ళు చెప్పిన విషయాలనే ఫాలో అవుతున్నాం. అయితే మీ జన్మ రాశిని బట్టి పక్కవాళ్ళు మీలో అసూయ పడే విషయం మాత్రం మీకు ఎవరూ చెప్పి ఉండరు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.

మేష రాశి (మార్చి 21-ఏప్రిల్ 19)

ఈ రాశి ప్రకారం మీరు చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్దాం అన్నా నేను రెడీ అంటూ సిద్ధమవుతారు. చాలామంది ఉదయం నిద్రలేవగానే చాలా బద్ధకంగా ఉంటారు. కానీ ఈ రాశి వారు అలా కాదు ఎప్పుడు చలాకీగా ఉంటారు. ఆ చలాకీతనం మాలో లేదని ఇతరులు అసూయ చెందుతుంటారు.

వృషభం (ఏప్రిల్ 20-మే 20)

వీరు చేసే ప్రతి పనినీ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. వంట చేయడం చాలా ఇష్టం వీరికి. వీరు ఏదైనా పని చేశారంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. చిన్న విషయమైనా సరే చాలా గొప్పగా చేయడం చేస్తారు. దీని వలన ఇతరులతో పోల్చితే ఫలితం బాగా ఉంటుంది. రొమాంటిక్ గా ఉంటారు.

మిధునం (మే 21-జూన్ 20)

ఈ రాశి ప్రకారం ఇతరులు అసహ్యించుకునే విధంగా అందంగా, ప్రకాశవంతంగా ఉంటారు. మీరు నలుగురితో కలిసి ఎవరి ఇంటికైనా లేదా బయటకు వెళ్ళినప్పుడు వాళ్లనే ముందుగా, సంతోషంగా పలకరిస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు కాంతివంతంగా ఉండటం వలన ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటారని అనుకుంటారు.

కర్కాటక రాశి (జూన్ 21-జూలై 22)

కర్కాటక రాశి వారిలో ఉండే బెస్ట్ స్నేహితులన్నా, స్నేహం అన్నా ప్రాణం ఇచ్చేస్తారు. కుటుంబం కంటే గొప్పగా చూసుకుంటారు. వాళ్లతోనే సంతోషం, వారితోనే కష్టాలు, వారికి ఏదైనా సమస్య వచ్చినా అస్సలు తట్టుకోలేరు. మనకు ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటుందని అందరూ అసూయ చెందుతారు.

సింహ రాశి (జూలై 23-ఆగస్టు 22)

వీరిని చాలా తక్కువమంది అసహ్యించుకుంటుంటారు. ఎందుకంటే నేను ఎలా ఉండాలి, నాలో నీకు నచ్చని విషయాలు ఏమైనా ఉంటే చెప్పు అని వీళ్ళే వెళ్లి అడుగుతూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరితోనూ హ్యాపీగా కలిసిపోవడం, ఉత్సాహంగా ఉండటం వీరి ప్లస్ పాయింట్. పార్టీస్ అంటే చాలా ఇష్టం. ఇవ్వడం అయినా తీసుకోవడం అయినా.

 కన్య రాశి (ఆగస్టు 23-సెప్టెంబర్ 22)

ఇతరులతో పోల్చితే ఏ పని చేసినా చాలా త్వరగా పూర్తి చేస్తుంటారు. ఆఫీస్ లలో ఐతే అందరికంటే ముందుగా ప్రమోషన్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అంటే రెండు రోజుల పనిని కూడా ముందే చేయడం, వీకెండ్ లలో కూడా పనిచేయడం వీరికి కష్టం. అదే ఎదుటివాళ్ళకు అసూయ.

 తులా రాశి (సెప్టెంబర్ 23-అక్టోబర్ 22)

ఏం జరిగినా సరే చాలా ప్రశాంతంగా ఉంటారు. ప్రతి విషయానికి గాబరా పడకుండా ఇతరులు టెన్షన్ పడుతున్నా వీరికి కంగారు ఉండదు. ఇంత కూల్ గా ఎలా ఉండగలుగుతున్నావ్ అని ఇతరులు అడుగుతున్నా ఒక చిరునవ్వు ఇస్తారు.

 వృశ్చికం (అక్టోబర్ 23-నవంబర్ 21)

వీళ్ళ రాశి ప్రకారం వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. శృంగారం గురించి కాస్త ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ విషయాల గురించి వీరికి ప్రత్యేక అవగాహన ఉంటుంది. ఎందుకంటే అంత ఇష్టం కాబట్టి. కానీ కొందరికి ఈ విషయాల గురించి తెలియనప్పుడు వారు చెబుతుంటే వాళ్ళ ఆనందం చూసి కుళ్ళుకుంటారు.

ధనుస్సు రాశి (నవంబర్ 22-డిసెంబర్ 21)

వీరికి ప్రయాణాలన్నా, సాహసాలన్నా చాలా ఇష్టం. ఎప్పుడు కొత్త ప్రదేశాలను సందర్శిస్తూ ఉండటం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తుంటారు. వీళ్లలా మనం వెళ్లలేక పోతున్నాం, ఆ ప్లేసెస్ చూడలేకపోతున్నాం, బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఫీల్ అవుతుంటారు.

 మకర రాశి (డిసెంబర్ 22-జనవరి 19)

ఈ రాశి వారు చాలా డిఫరెంట్. ఎందుకంటే మీరు ఏదైనా విషయం గురించి సీరియస్ గా ఉంటే వీళ్ళు అంతకంటే ఎక్కువ సీరియస్ గా ఉంటారు. ఇక కామెడీ విషయానికొస్తే ప్రతి విషయాన్ని చాలా ఫన్నీగా తీసుకుంటుంటారు. చూడటానికే సీరియస్ గా ఉంటారు కానీ వీళ్ళు చేసే ఫన్ అందరికీ నవ్వు తెప్పిస్తుంది. మిగతా వారు మాత్రం ఇలా చేయడానికి ఇబ్బంది పడతారు.

కుంభ రాశి (జనవరి 20-ఫిబ్రవరి 18)

ఒంటరిగా ఉండటం వీరికి చాలా ఇష్టం. సమాజం గురించి అస్సలు పట్టించుకోరు. నా ప్రతి క్షణాన్ని నేను సంతోషంగా జీవించాలి అని అనుకునే టైప్. మీతో కలవడానికి చాలామంది ట్రై చేస్తున్నా మీరు మాత్రం వాళ్లకు దూరంగా ఉంటుంటారు. అదే వారికి ఇష్టం ఉండదు.

మీనం (ఫిబ్రవరి 19-మార్చి 20)

వీళ్ళను బార్న్ ఆర్టిస్ట్స్ (పుట్టుకతోనే నటన) అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాస్యం, సెంటిమెంట్, ఎమోషనల్, ఉత్సాహం..  ఇలా ప్రతి ఒక్కటి పరిస్థితి తగ్గట్లుగా యాక్షన్ రూపంలో చెబుతుంటారు. అయితే చిన్న చిన్న విషయాలకు మాత్రం చాలా బాధపడుతుంటారు. ఇదే వీరి వీక్ నెస్.

అవును మీరు చెప్పింది నిజమే అని మీకు అనిపిస్తే తప్పకుండా SHARE చేయడం మర్చిపోకండి.

ఇవి కూడా చదవండి.

పిల్లలకు సున్నిపిండిని ఎలా ఉపయోగించాలి? ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన 5 ఉపయోగాలు

Leave a Reply

%d bloggers like this: