మగవాళ్ళు ఈ 4 పనులు చేస్తే ఆడవాళ్లకు బాగా నచ్చుతారు : మీరు ఊహించని విషయాలు

భార్యభార్యల బంధాన్ని, అనుబంధాన్ని మరింత పటిష్టం చేసే సంగతులు, దంపతుల మధ్య సంతోషాన్ని కలిగించే పనులు, మరీ ముఖ్యంగా భర్త భార్య నుండి దాంపత్య జీవితంలో కోరుకునే ప్రత్యేకమైన విషయాల గురించి ఎవరు మీతో చెప్పి ఉండరు. మీ భర్తను సంతోషపెట్టాలంటే ప్రతి భార్య ఈ నాలుగు పనులు చేస్తే చాలు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే తెలుసుకోండి.

ఇంటి వాతావరణాన్ని మార్చాలి

ఏ భర్తైనా ఇంట్లోకి ఏవి కావాలో ఏం అవసరమో తీసుకురాగలడు కానీ ఇంటి వాతావరణాన్ని అందంగా తీర్చగలిగే బాధ్యత మాత్రం భార్యదే. బయటకు వెళ్లినా,  ఆఫీస్ కు వెళ్లినా, ఏదైనా ఊరికి వెళ్లినా ఎప్పుడు మన ఇంటికి వెళ్లిపోదామా అని భర్త మనస్సుకు అనిపించేలా తక్కువ వస్తువులతోనే ఇంటిని కళకళలా, అందంగా ఉంచాలి. మీ అత్త మామ గారు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే భర్త మూడీగా చక్కని సంగీతం లేదా మీరే పాట పాడితే ఇంటికి రావాలనిపిస్తూ ఉంటుంది.

ప్రోత్సహిస్తూనే ఉండాలి

బయటకు వెళ్లిన మీ భర్తకు కుటుంబ బాధ్యతలతో పాటు ఎన్నో సతమతమయ్యే పనులు ఉంటాయి. ప్రతి విషయానికి నవ్వుకునే వాళ్ళు, తక్కువ చేసి చూసే వాళ్ళు, కొత్తగా ఏదైనా చేస్తున్నా, తన పని తాను చేసుకుపోతున్న వెక్కిరించే వాళ్ళు దూరం పెట్టేవాళ్ళు ఉంటారు. అందుకని ప్రతి విషయానికి మీ ఆయనను ప్రోత్సహించాలి. ఇంటికి రాగానే బయట విషయాలు మర్చిపోయేలా చేసి ఆనందాన్ని ఇవ్వాలి. ఇలా చేస్తే ఆ టెన్షన్స్ అన్నిటినీ మర్చిపోతాడు.

నా భార్య కష్టపడుతోంది

నిజం చెప్పాలంటే మీ భర్తకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారంటే అది మీరే. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుండి రాత్రి నిద్రించేవరకు ఇంటి పని, వంట పనులు, పిల్లలను చూసుకోవడం, మీ ఆయనకు, ఇంట్లో పెద్దవాళ్లకు ఏం కావాలో చూసుకోవడం చేస్తుంటారు. మీ కష్టాన్ని కళ్లారా చూసిన మీ భర్త తన కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉండాలంటే నేను బాగా కష్టపడాలి అని ప్రతి రోజూ అనుకుంటాడు. అందుకే మీరు మీ ఆయనను గౌరవిస్తూనే ఉండండి. ఆయన మీకు అదే గౌరవాన్ని ఇస్తూ ఉంటాడు.

మీరే ఆయన ప్రపంచం

కుటుంబాన్ని బాగా చూసుకోవడం భార్యాభర్తల బాధ్యత. మీరు ఇంటిని, పిల్లలను బాగా చూసుకుంటే, మీ ఆయన మీ బాధ్యతలను చూసుకోగలడు.  ఆయనకు మీరు, మీ పిల్లలే ప్రపంచం. ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. అలాగే భార్య అంటే ప్రత్యేకమైన ఇష్టం. మీకంటే అందమైన వారు, అర్థం చేసుకునేవారు ఎవరు ఉండరని అనుకుంటాడు. అందుకని ఎప్పటికీ మీ ఆయనకు అదే ఫీలింగ్ ఉండేలా చూసుకోండి.

ఈ 4 విషయాలు ప్రతి భర్త తన భార్య నుండి ఖచ్చితంగా  కోరుకుంటాడు. మీరు నిర్లక్ష్యం చేయకండి.  ఈ ఆర్టికల్ మీకు నచ్చితే అందరికీ SHARE చేయగలరు.

ఇవి కూడా చదవండి. 

పిల్లలకు సున్నిపిండిని ఎలా ఉపయోగించాలి? ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన 5 ఉపయోగాలు

Leave a Reply

%d bloggers like this: