తల్లి కడుపులో బిడ్డ ఎదుగుదల మొదలయినప్పటి బిడ్డకు ఏ పేరు పెడితే బాగుంటుంది అని ప్రతి తల్లితండ్రులు చర్చించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది తల్లితండ్రులు అబ్బాయి పుడితే నాన్నగారి పేరు, తాత గారి పేరు పెట్టాలని, అదే అమ్మాయి పుడితే మా అమ్మ పేరు పెడదాం అని భార్యతో భర్తలు చెబుతుంటారు. అయితే ఇప్పుడు అందరూ కాస్త మోడ్రన్ గా ఉండే పేర్లు పెడుతున్నారు కాబట్టి, అలా మే నెలలో టాప్ 10 లో నిలిచిన అబ్బాయి పేర్లు మీకోసం..
1.Arya – ఆర్య
ఈ మధ్య తెలుగువారు తమ మగపిల్లలకు పెట్టుకున్న పేరు ‘ఆర్య’. ఆర్య అంటే పెద్దవారిని, చదువు నేర్పించే వారిని గౌరవంగా పిలుస్తుంటాం. అలాగే పార్వతీ దేవిని కొలిచేవారు తమ పిల్లలకు ఈ పేరు పెట్టుకుంటున్నారు.
2.Aarav – ఆరవ్
ఆరవ్ అంటే ప్రకాశవంతత కలిగిన వాడు అని అర్థం.
3.Dhruva – ధృవ
నమ్మదగినవారు, విశ్వాసం కలిగినవారు అని అర్థం.
4.Upanay -ఉపనయ్
ఇతరుల కోసం ఆలోచించే మంచి నాయకుడు అని అర్థం.
5.Pramod – ప్రమోద్
ఎప్పుడు సంతోషాన్ని ఇచ్చేవాడు అని అర్థం.
6.Mahant – మహంత్
గొప్ప జ్ఞానవంతులు అని చెప్పడానికి అర్థంగా ఈ పేరును చెబుతున్నారు.
7.Vedhanth – వేదాంత్
అందరి బాగోగులు చూసుకునే రాజు లాంటి వాడని అర్థం.
8.Koushik – కౌషిక్
తన చుట్టూ ఉన్న వారిని ప్రేమగా చూసుకోవడం, ఆప్యాయంగా పలకరిస్తారు అని అర్థం.
9.Chetan -చేతన్
ప్రతి విషయాన్ని సూక్ష్మంగా తెలుసుకుంటారు. అందరిలోనూ ఆక్టివ్ గా ఉంటారు.
10.Lohith – లోహిత్
మంచి హృదయం కలిగిన వాడు.
మరి మీ అబ్బాయికి ఎంత ముద్దు పేరు పెట్టారో COMMENT రూపంలో చెప్పవచ్చు. అందరికీ SHARE చేయండి.