తల్లితండ్రులు పిల్లల ముందు ఎప్పుడు చేయకూడని 7 పనులు

మీ పిల్లల ముందు మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? లేదా మీకు ఇష్టంవచ్చిన పని చేయచ్చా? ఎట్టి పరిస్థితులలో అలా చేయకూడదు. మీరు మీ పిల్లల ముందు చేసే పనులు, మాట్లాడే మాటలు వారి మానసిక స్థితి , ఎదుగుదల మీద తీవ్ర  ప్రభావం చూపిస్తాయి.కొన్ని సార్లు మీరు చేసే పనులను బట్టి,  ఆ ప్రభావం చెడుగా ఉంటుంది. పిల్లల మీద చెడు ప్రభావం చూపించే ఆ పనులు వారి ముందు ఎప్పుడు చేయకూడదు, అవేంటో తెలుసుకోండి.

1. గొడవ పడడం

భర్త ఆఫీస్ నుండి రావడం, ఇళ్ళు సరిగా సర్దలేదని లేదా కాఫీ బాలేదని, భర్యను అరవడం. భార్య ఇంకో మాట ఏదో అనడం. అది చిలికి చిలికి పెద్ద గొడవ అవడం ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. మీరు సహజమే అనుకుంటారు. కానీ మీరు మీ పిల్లల గురించి మర్చిపోతున్నారు. ఇదంతా చూసిన పిల్లలు ఇతరులతో గొడవపడటం తప్పు కాదు అనుకుంటారు.

2. చాడీలు

మీరు పిల్లల ముందు అనేక విషయాలు చర్చించుకుంటారు, అందులో తప్పు లేదు. కానీ ఏమి చర్చించుకుంటున్నారు అన్న దాని మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి. పక్కింటి వారు లేదా మీ బంధువులు గురించి ఒకరికొకరు చాడీలు చెప్పుకోవద్దు. మీ పిల్లల అది నేర్చుకుంటారు.

3. నిజం దాచడం

పిల్లలు చాలా సున్నితం. అది మీకు తెలిసిందే అందుకే వారు ముందు, చాలా నిజాలు మాట్లాడుకోరు. చాలా విషయాలను వారి నుండి దాచి పెడుతాం. ఈ సమాజంలో జరిగే మంచి చెడు గురించి పిల్లలకు ఎప్పటికైనా తెలియాల్సిందే. అందుకు ఇప్పటి నుండే వారిని సిద్ధం చేయండి. ఎవరైనా చనిపోతే, వారు ఊరికి వెళ్ళారు, దేవుడి దగ్గరకు వెళ్ళారు అని కాకుండా చనిపోయారని నిజం చెప్పండి.

4. అగౌరవ పరచడం

మీ పిల్లల టీచర్స్ తో, మీ స్నేహితులతో లేదా ఎవరితోనైనా సంభాషించే సమయంలో, మీ పిల్లలు ముందు వారిని అగౌరవపరిచ వద్దు. నిదానంగా విషయం గురించి మాట్లాడి పరిష్కరించుకోండి. మీ పిల్లలు మీ నుండి నేర్చుకుంటారు. అలా కాకుండా పెద్దగా అరుచుకుంటూ, ఎదుటి వారిని దూషిస్తే, మీ పిల్లల మీద చేదు ప్రభావం చూపిస్తుంది.

5. ఏకాంతంగా ఉండటం

మీ పిల్లల ముందు ఎప్పుడు ఏకాంతంగా ఉండకండి ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరి తల్లి తండ్రులకు తెలిసిన విషయమే. కావాలని పిల్లల ముందు ఇలా ఎవరు చేయరు. కానీ పిల్లల తో పాటు కలిసి ఒక నిద్రపోతున్నప్పుడు, పిల్లల నిద్రపోయారేమో అనుకుని, పొరపాటు జరగచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఇలా జరగడం పిల్లల మీద తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తుంది.   

Leave a Reply

%d bloggers like this: