రాత్రి పూట పిల్లలకు ఎప్పుడు తినిపించకూడని 4 ఆహారాలు

పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే తల్లితండ్రులకు ఆనందం. పిల్లలకు ఏమైనా ఐతే తల్లితండ్రులు విలవిలలాడిపోతారు. మరి మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే  వారికి ఎటువంటి ఆహారం ఇవ్వాలి, ఏ ఆహారం ఇవ్వకూడదో తెలుసుకోవాలి కదా. ముఖ్యంగా పిల్లలకు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది, రాత్రి పడుకునే కొన్ని  గంటల ముందు వారికి ఈ ఆహారాన్ని అస్సలు ఇవ్వకండి. ఆ ఆహారం ఏంటో తెలుసుకున్నాక అందరికీ తెలిసేలా SHARE చేయండి.

కెఫిన్ ఉన్న ఆహారం

కెఫిన్ ఉన్న ఆహార పదార్థాలు అంటే కేవలం కాఫీ మాత్రమే కాదు. కాఫీ, టీ, చాకోలెట్స్ నిద్రకు ముందు ఇవ్వడం వలన పిల్లలను నిద్రపోకుండా చేస్తుంది. కెఫిన్ యూరిన్ ను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది కాబట్టి త్వరగా నిద్రపోరు. అయితే వైట్ చాకోలెట్స్ ఇవ్వడం వలన ఇబ్బందేమీ ఉండదు. ఎందుకంటే ఇందులో కెఫిన్ తక్కువ మోతాదులో ఉంటుంది.

మాంసం

సాధారణంగానే మాంసం జీర్ణం కావడానికి 24 గంటల సమయం పడుతుంది. అటువంటిది పిల్లలో జీర్ణప్రక్రియ తక్కువగా ఉంటుంది కాబట్టి చికెన్, మటన్, పంది మాంసం, రెడ్ మీట్..వంటివి రాత్రిళ్ళు ఇవ్వడం వలన త్వరగా జీర్ణం కాక కడుపునొప్పి వచ్చే ప్రమాదం ఉంది.

షుగర్ కలిసిన పదార్థాలు

షుగర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు అంటే ఐస్ క్రీమ్స్, కుకీస్, క్యాండీస్, స్వీట్స్ నిద్రకు ముందు పిల్లలు తినడం వలన వాళ్ళు నిద్రపోవడానికి చాలా సమయం ఉంటుంది. ఎందుకంటే షుగర్ లో ఎక్కువసేపు ఎనర్జీగా ఉంచే లక్షణాలు ఉండటమే. పిల్లలకు సరైన నిద్రలేకపోతే ఇది మరో సమస్యగా మారుతుంది.

మసాలా మరియు ఉప్పు పదార్థాలు

మసాలా కలగలసిన ఆహార పదార్థాలు మరియు ఉప్పు ఉన్న పదార్థాలు రాత్రి పూట పిల్లలకు ఇవ్వడం వలన వారి గొంతులోనే ఉన్నట్లుగా తేపులు రావడం, వాంతులు కావడం జరుగుతుంది. మసాలా పదార్థాలు తిన్నవెంటనే కొందరు పిల్లలలో కడుపునొప్పి సమస్యలు తలెత్తుతుంటాయి.

కాలీఫ్లవర్ మరియు బ్రోకలీ

ఇటువంటి ఆహారాన్ని నిద్రకు ముందు తినిపించడం వలన ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిలో ఎక్కువ శాతం ఫైబర్ ఉండటమే మంచిదే అయినా కానీ పిల్లలలో జీర్ణప్రక్రియ ఆలస్యంగా ఉంటుంది కాబట్టి రాత్రి పూట తినిపించకండి.

ఆల్కహాల్  ఉన్న మెడిసిన్స్

కొన్ని మందులలో ఆల్కహాల్ పర్సెంటేజ్ కూడా ఉంటుందని చాలామంది తెలియకపోవచ్చు. ఈ మందులను పిల్లలకు ఇవ్వడం ఎటువంటి హానికరం కాకపోయినా, సహజమైన మందులను ఇవ్వడం మంచిది. ఉదాహరణకు వారు దగ్గు, జలుబుతో బాధపడుతున్నప్పుడు సిరప్ వంటి మందులు కాకుండా తేనె, పెప్పర్..వంటివి మంచిది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

3 అద్బుతమైన ఆహారాలు: ఎదిగే పిల్లలకి అత్యంత అవసరం

Leave a Reply

%d bloggers like this: