ఈ 5 ఆహార పదార్థాలను ఎప్పటికీ కలిపి తీసుకోకూడదు. విషంతో సమానం

ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ చెబుతూ ఉంటారు. అందుకోసం మంచి ఆహారం తీసుకోవాలని,  కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకూడదని  అంటుంటారు. ఐతే ఇక్కడ చెప్పుకునే ఆహార పదార్థాలను ఎప్పుడు కలిపి తీసుకోకూడదని మన ఆయుర్వేద నిపుణులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ పదార్థాలు ఏంటో మీరే చూడండి.

తేనె

తేనె ఆరోగ్యకరమని చాలా రకాల ఆయుర్వేద పదార్థాలలో వాడుతారని అందరికీ తెలుసు. అయితే తేనెను ఎప్పటికీ వేడిచేసి తీసుకోకూడదు. ఈ విధంగా చేయడం వలన రుచిపోతుంది మరియు విషంతో సమానమాట. అలాగే తేనెను ఫ్రిజ్ లో ఉంచాల్సిన అవసరం లేదు. గది వాతావరణంలో ఉంటే తేనె చెడిపోదు.

నెయ్యి

నెయ్యిని మనం కొన్ని వంటకాలు లేదా భోజనం చేసేటప్పుడు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఇక తేనెను అరుదుగా లేదా  ఆయుర్వేదం ఫాలో అవుతున్నవారు తీసుకుంటూ ఉంటారు. ఐతే అనారోగ్యం బాగోలేనప్పుడు తేనె, నెయ్యి మిక్స్ చేసి తీసుకుంటే ప్రమాదకరం.

కాఫీ

చాలామందికి ఉన్న అలవాటు ఉదయం నిద్రలేవగానే పరగడుపున కాఫీ, టీలను సేవించడం. ఐతే ఎప్పుడు ఈ విధంగా చేయకూడదు. ఇలా చేస్తే గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. నిద్రలేచిన తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్లు తీసుకుని కొన్ని నిముషాల తర్వాత కాఫీ, టీ తాగవచ్చు.

నిమ్మరసం పాలు

నిమ్మరసంలో పాలు కలుపుకుని ఎప్పటికీ తీసుకోకూడదు. ఇలా చేయడం వలన గ్యాస్, అసిడిటీకి కారణమై హృదయ సంబంధిత సమస్యలు వస్తాయి.

మందులు వేసుకునేటప్పుడు

కొంతమంది అనారోగ్యం బాగోలేనప్పుడు నీటితో కాకుండా జ్యూస్, కూల్ డ్రింక్స్, కాఫీ, టీలతో టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఇలా ఎప్పటికీ చేయకూడదు. అలాగే మత్తు పానీయాలు కూడా వాడకూడదు.

మాంసాహారం పాలు

మాంసాహారం తీసుకునేటప్పుడు పాలు కలిపి తీసుకోవడం వలన శరీరంలో ట్యాక్సిన్స్ పేరుకుపోయి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి.

ఈ విషయాలు చాలామందికి తెలిసి  ఉండకపోవచ్చు. అందుకే అందరికీ SHARE చేయగలరు.

ఇవి కూడా చదవండి. 

భర్త చనిపోతాడని తెలిసి 5 రోజుల ముందే బిడ్డకు జన్మను ఇచ్చిన గొప్ప తల్లి

Leave a Reply

%d bloggers like this: