ఖర్జూరం తినడం వలన ప్రసవ సమయంలో నొప్పులు తగ్గుతాయా?

బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి తల్లిపడే నరకయాతన మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే ప్రసవ సమయంలో కలిగే నొప్పులను తట్టుకోవడం అంటే తన ప్రాణాలను తన బిడ్డ కోసమే అనేంతగా కష్టపడుతుంది. అందుకే అమ్మ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అంటారు. అయితే ప్రసవ సమయంలో  నొప్పులు తగ్గడానికి కొన్ని సులభ పద్ధతులు ఉన్నాయి. అవేంటో మీరే తెలుసుకోండి.

ప్రసవ నొప్పులు – ఖర్జూరం

కొందరు ఆరోగ్య నిపుణులు ప్రసవానికి సిద్ధమైన కొందరు మహిళలను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు వారు ప్రతి రోజూ 6 ఖర్జూరం పండ్లు తినగా, రెండవ గ్రూపు వారు వాటికి దూరంగా ఉన్నారు. ప్రసవ సమయంలో రెండవ గ్రూపు వారితో పోల్చితే మొదటి గ్రూపు మహిళలు అతి తక్కువ నొప్పులతోనే ఎటువంటి బాధ లేకుండా పిల్లలకు జన్మనిచ్చారు. అందుకే గర్భిణీలు ప్రసవానికి ముందు లేదా అంతకంటే ముందుగానే ఖర్జూరాలను తినడం వలన ప్రసవ నొప్పులు తగ్గుతాయి. అలాగే రక్తస్రావం ఉండదు.

పురిటి నొప్పులు తగ్గడానికి ఇష్టమైన వారు ప్రక్కన ఉంటే

ప్రసవ సమయంలో కలిగే నొప్పులను తట్టుకుని బిడ్డకు జన్మను ఇవ్వడం ఆ మహిళకు పునర్జన్మ లాంటిదే. హార్ట్ బీట్ పెరుగుతుంది, శ్వాసలో మార్పులు కలుగుతాయి. అందుకని వారికి ధైర్యం కలగడానికి వారిని ప్రేమించే భర్త,తల్లి, స్నేహితుడు..ఇలా ఎవరైనా ఉండటం వలన ప్రసవ నొప్పులను కొద్దివరకైనా తట్టుకోగలరని ఆరోగ్య నిపుణులు చేసిన పరిశోధనలో తేలింది. అలాగే శ్రావ్యమైన సంగీతం కూడా వినిపించవచ్చు. 

బాలింతలు ఖర్జూరం

బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత తల్లి పాలు లేక చాలామంది తల్లులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే తల్లి పాలు బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపెడుతుంది. అందుకని బాలింతలు ఖర్జూరాలు తినడం వలన పాలు బాగా పడతాయి.

ఖర్జూరం ఉపయోగాలు

ఖర్జూరాలలో ఐరన్, కాల్షియం అధికంగా ఉండటం వలన ఎముకలు  దృఢంగా ఉండేలా చేస్తుంది.  గర్భంతో ఉన్న మహిళలు ఖర్జూరాలు తినడం వలన రక్తహీనత సమస్య ఉండదు. అలాగే ఎప్పుడు యాక్టివ్ గా ఉండేలా సహాయపడుతుంది.  రోగ నిరోధక శక్తిని పెంచి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఖర్జూరం బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

అందరికీ చేరేలా ఈ ఆర్టికల్ ను SHARE చేయండి. 

Leave a Reply

%d bloggers like this: