చంకలలో నలుపు, దుర్వాసనను 2 నిముషాల్లో దూరం చేసే ఇంటి చిట్కాలు

బిగుతైన దుస్తులు ధరించినప్పుడు లేదా ఎండలో బయటకు వెళ్లి వచ్చినప్పుడు చాలామందికి చమట  పట్టి బాహ్యమూలల నుండి దుర్వాసన వస్తుంది. మహిళలు తరచూ ఈ సమస్యను ఎదుర్కుంటున్నవారే. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ గృహ చిట్కాలను పాటించడం వలన చంకలలో నలుపు, దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.

పెరుగు, తేనె

రెండు స్పూన్ల పెరుగులో ఒక స్పూన్ తేనె కలుపుకుని చంకలలో మర్దనా చేసుకుని శుభ్రం చేసుకోవడం వలన అక్కడ ఉండే నలుపు  దూరం  అవుతుంది.

రోజ్ వాటర్

స్నానం చేసుకునే నీటిలో రెండు లేదా మూడు చుక్కల రోజ్ వాటర్ కలిపి, ఆ నీటితో స్నానం చేసుకోవడం వలన బాహ్యమూలలలో ఎటువంటి చమట దుర్వాసన ఉండదు. ఐతే స్నానం చేశాక డియోడరెంట్స్ ను వాడకండి.

పసుపు, పెసర పిండి, పాలు

మీ ఇంట్లో లభించే పాలు, పెరుగు, పసుపు, పెసరపిండి మిశ్రమాన్ని ఒక్కో స్పూన్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చంకలలో రాసుకుని ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వలన నలుపు, దుర్వాసన ఉండదు.

నిమ్మకాయ

చంకలు, మెడ భాగాలలో నలుపు ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది నిమ్మ తొక్కలను అక్కడ రాస్తూ ఉంటారు. అలాగే దుర్వాసన ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా చేయడం గానీ ఒక బౌల్ లోకి నిమ్మరసం తీసుకుని చంకలలో రాసుకుని శుభ్రం చేసుకోవడం వలన వాసన నుండి విముక్తి లభిస్తుంది.

దోసకాయ

తాజాగా దోసకాయ ముక్కలను నలుపుగా ఉన్న బాహ్య మూలలలో ఒక అరగంట పాటు ఉంచడం వలన నలుపు త్వరగా తగ్గిపోతుంది. అలాగే చమట ఉన్నప్పుడు రాషెస్ వంటివి కలగకుండా సహాయపడుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్

డియోడరెంట్స్, పౌడర్లకు బదులుగా స్నానం చేసుకునే నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ రెండు చుక్కలు కలుపుకుని స్నానం చేయడం వలన దుర్వాసన ఉండదు మరియు బాహ్యమూలలో కలిగే మంట, దురదను తగ్గిస్తుంది.

అవాంఛిత రోమాలు

బాహ్య మూలలలో దుర్వాసన రావడానికి ఇవి కూడా ఒక కారణం కాబట్టి ఎప్పటికప్పుడు అవాంఛిత రోమాలను తీసివేస్తూ ఉండటం వలన చమట సమస్య ఉండదు.

శనగపిండి, పెరుగు

ఒక స్పూన్ పెరుగు, రెండు స్పూన్ల శనగపిండి, కొద్దిగా నిమ్మరసం మరియు పసుపును తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చంకల నలుపు భాగాలలో వారానికి రెండుసార్లు రాసుకుని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మహిళలు ఎక్కువగా ఇబ్బందిపడే ఈ సమస్య నుండి బయటపడటానికి అందరికీ SHARE చేయండి.

 ఇవి కూడా చదవండి.

మిమ్మల్ని బాధపెట్టే మీ భర్త నుండి వచ్చే 6 వాఖ్యాలు

Leave a Reply

%d bloggers like this: