పిల్లలలో ఆకలిని పెంచి బలాన్ని ఇచ్చే 5 ఆయుర్వేద ఆహార పదార్థాలు

పసి వయసులో పిల్లలు సరిగ్గా తినకపోతే తల్లితండ్రులు కంగారుపడి పోతుంటారు. కొందరు పిల్లలైతే అసలు ఆహారం అంటేనే  ఇష్టం చూపించరు, దూరంగా వెళ్తూ చిరుతిండ్లను ఇష్టపడుతుంటారు. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ ఆహార పదార్థాలు పిల్లలకు ఇవ్వడం వలన వారిలో ఆకలి పెరుగుతుంది   మరియు బలం కూడా.. 

రాగి జావా ఓట్స్

పిల్లలలో ఆకలి బాగా వేయాలంటే ఎక్కువగా రాగి జావా, పాలతో కలిపి ఓట్స్, అరటిపండు, అరటిపండు పాలు చక్కెర కలిపిన ఆహారం, నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు, బయటదొరికే జ్యూస్ లు కాకుండా ఇంట్లో తయారు చేసిన పండ్ల రసాలు ఇవ్వడం వలన త్వరగా జీర్ణమై ఆకలిని పెంచుతాయి.

ఉసిరి రసం

పిల్లలకు ఎందుకు ఆకలి కలగదు? అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. త్వరగా జీర్ణం కాకపోవడం వలన, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం మరియు వికారం, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన. అందుకని ప్రతి రోజూ రెండు స్పూన్ల ఆమ్లా జ్యూస్ ను పిల్లలకు ఇవ్వడం వలన త్వరగా ఆకలి కలుగుతుంది. పెద్దవాళ్ళు కూడా ఇలా చేయవచ్చు.

మెంతి పొడి

ప్రతి రోజూ ఉదయం ఒక అర స్పూన్ లేదా స్పూన్ మెంతి పొడిని తేనెతో కలిపి ఇవ్వడం వలన ఆకలి పెరుగుతుంది. తీసుకున్న ఆహారం కూడా త్వరగా జీర్ణమై పొట్టలో ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తుంది.

శొంఠి మరియు మిరియాలు

పిల్లలకు వికారం వాంతుల కారణంగా ఆకలి కలగకపోవడానికి ఒక కారణం కాబట్టి ఆకలిని పెంచడానికి ఇసి బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక పావు కిలో బియ్యం, ఇరవై గ్రాముల శొంఠి మరియు రెండు గ్రాముల మిరియాలు తీసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బాక్స్ లో దీన్ని నిల్వ ఉంచుకోవాలి.  దీనిని ప్రతిరోజూ ఒక స్పూన్ ఒక గ్లాస్ నీటిలో కలిపి ముద్దలుగా అయ్యేలా ఉడికించాలి. దీనికి కాస్త ఆవు నెయ్యి కలిపి ముద్దలుగా చేసుకోవాలి. ఐతే కొందరు పిల్లలు తియ్యగా ఉంటే తింటారు కాబటి వారికి పటికబెల్లం కలిపి పెట్టవచ్చు, అలా ఇష్టపడని వారికి కొద్దిగా సాల్ట్ కలిపి తినిపిస్తే ఆకలి పెరుగుతుంది.

పాప్ కార్న్

సాయంత్రం పూటగా స్నాక్స్ గా చాక్లెట్స్ కు బదులుగా మొక్కజొన్న విత్తనాలు ఉడకబెట్టి ఇవ్వడం, పా ప్ కార్న్, క్రీమ్ చీజ్ , నట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్ షేక్స్, వేరు శనగలతో చేసిన తియ్యటి పదార్థాలు ఇవ్వడం వారి ఆరోగ్యానికి మరియు జీర్ణక్రియకు మంచిది.

ఈ ముఖ్యమైన సమాచారాన్ని ప్రతి తల్లికీ చేరేలా SHAREచేయండి. ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే COMMENT సెక్షన్ లో తెలుపవచ్చు. 

Leave a Reply

%d bloggers like this: