ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, ఎప్పుడు ఏం తినాలో మన పెద్దలు, వైద్యులు చెబుతూనే ఉంటారు. కానీ భోజనం లేదా ఆహారం తీసుకున్న తర్వాత ఇక్కడ చెప్పుకునే ఈ పనులు చేయడం ఎంత ప్రమాదకరమో బహుశా చాలామందికి తెలియకపోయుండవచ్చు. ఇక్కడ చెప్పుకునే విషయాలు మీకు మరియు మీ పిల్లలకు కూడా..
స్నానం
భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వలన తిన్న ఆహారం విషంగా మారుతుంది అంటారు. నిజానికి మన శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. అయితే తిన్న వెంటనే స్నానం చేయడం వలన రక్త సరఫరా జీర్ణాశయానికి తగ్గడంతో ఆహారం జీర్ణం అవ్వక గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి.
ఫ్రూట్స్
ఆహారం తీసుకున్న వెంటనే ఫ్రూట్స్ తినడం వలన తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది అని చెబుతారు. నిజమే కావచ్చు వెంటనే తినడం వలన తీసుకున్న ఆహారం జీర్ణం పేగుల్లో అడ్డుపడి జీర్ణ సమస్యలకు కారణమై గ్యాస్ ఫాం అవుతుంది. కొన్నిసార్లు ఆహారం గొంతులోనే ఉందేమో అనేలా తేపులు వస్తుంటాయి. అందుకని ఒక అరగంట తర్వాత తినడం మంచిది.
సిగరెట్
ఆహారం తీసుకున్న వెంటనే చాలామందికి సిగరెట్ తాగాలని నాలుక లాగుతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆహారం తీసుకున్న ఒక్క సిగరెట్ తాగడం వలన అది 10 సిగరెట్ లతో సమానవుతుంది.
వాకింగ్ వ్యాయామాలు
తిన్న వెంటనే ఎక్కడ లావైపోతామోనని వేగంగా నడవడం,పరుగెత్తడం, వ్యాయామాలు చేయడం, స్విమ్మింగ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఒక పది నిముషాలు కూర్చుని ఆ తర్వాత నెమ్మదిగా నడవడం చేయాలి. వ్యాయామాలు వంటివి, ఆడుకోవడం, వెల్లకిలా పడుకోవడం చేస్తే అనారోగ్యానికి కారణమవుతాయి.
కాఫీ టీ
మనం తీసుకునే ఆహారంలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. వాటిని శరీరం సరిగ్గా గ్రహించకుండా చేసేవి కాఫీ, టీ లు కాబట్టి. ఒక అరగంట తర్వాత వీటిని సేవించడం మంచిది.
ఈ విలువైన సమాచారాన్ని అందరికీ దయచేసి SHARE చేయండి.