మీ పిల్లల ఎముకలు బలంగా, దృఢంగా చేసేందుకు తినిపించాల్సిన 5 ఆహారాలు

పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి తల్లితండ్రులు ప్రత్యేక శ్రధ్ద తీసుకుంటూ ఉంటారు. అయితే పిల్లలు బాగా  ఎదగడానికి, ఎముకలు,  కండరాలు బలంగా ఉండేందుకు ఎటువంటి ఆహారం పిల్లలకు ఇస్తే మంచిది అనే విషయాలు చాలామందికి తెలియవు. ఇక్కడ చెప్పుకునే ఈ ఆహార పదార్థాలను పిల్లలకు తరచూ ఇస్తూ ఉండటం  వలన పిల్లల ఎముకలు, కండరాలు బలంగా దృఢంగా ఉంటాయి.

పాలు

చిన్నతనంలో పిల్లలకు ప్రతి రోజూ ఒక గ్లాస్ పాలు ఇవ్వడం చేస్తుండాలి. పాలల్లో అధిక కాల్షియం ఉండటం వలన పిల్లల ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. ఒక్క కాల్షియమే కాకుండా శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫాస్పరస్, విటమిన్ డి మరియు పొటిషియం పుష్కలంగా ఇందులో ఉంటాయి. హైట్ పెరగడానికి సహాయపడుతుంది.

పెరుగు

అధ్యయనాల ప్రకారం ఎముకలు, కండరాలు బలంగా ఉండాలంటే శరీరానికి ఎక్కువ మోతాదులో కాల్షియం అందాలి. కాల్షియం ఎక్కువగా ఉండే వాటిలో పెరుగు ఒకటి. ఇందులో దాదాపు 40 శాతంపైగా కాల్షియం ఉంటుంది. అందుకని పిల్లలకు ప్రతి రోజూ ఒక కప్పు తాజా పెరుగు ఇవ్వడం మంచిది.

గుడ్లు

పిల్లల ఎదుగుదలకు మరియు వారి ఎముకలు దృఢంగా ఉండేందుకు గుడ్లు చాలా మంచివి. వీటిలో అధిక శాతం విటమిన్స్ (ముఖ్యంగా విటమిన్ డి) మరియు ప్రోటీన్స్ ఉండటం వలన బోన్స్ అభివృద్ధికి బాగా ఉపయోగపడుతాయి.

అరటి పండు

వీటిలో కాల్షియం లేకపోయినా ఇందులో ఉండే పోషక పదార్థాల వలన శరీరానికి కావలసిన కాల్షియంను అందించి ఎముకలు బలంగా ఉండేలా దోహదపడతాయి. అరటిపండులో మెగ్నీషియం  అధికంగా ఉండటం వలన కండరాలు దృఢంగా ఉంచేలా చేస్తుంది.

సోయా బీన్స్

బీన్స్, సోయా పాలు, పాల పదార్థాలు, గ్రీన్ వెజిటేబుల్స్ లలో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు బలంగా ఉంటాయి. మన శరీరం ఎంత కాల్షియం తీసుకున్నా అందులో 90 శాతం ఎముకలకు అవసరం అవుతుంది.

సూర్య కిరణాలు

ఎవరిలోనైనా ఎముకలు బలంగా లేకపోతే ఉదయమే సూర్య కిరణాలు  తగిలేలా నడవమని గానీ బయట కూర్చోమని చెప్పడం కానీ చేస్తారు. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ డి ఇందుకు కారణం. అందుకే విటమిన్ డి టాబ్లెట్స్ బదులుగా పైన చెప్పినట్లు చేయడం మంచిదని చెబుతారు. సాయంత్రం గం.5ల తర్వాత సూర్య కిరణాలు పడేలా చూసుకోవడం మంచిది.

ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ ఉపయోగపడేలా SHARE చేయండి. 

ఇవి కూడా చదవండి. 

పిల్లలకు ఇష్టమైన మరియు ఆరోగ్యకరమైన 3 ఆహారాలు: తయారుచేసే విధానం

Leave a Reply

%d bloggers like this: