సాధారణంగా యుక్త వయస్సులో మొటిమలు రావడం సహజమే కానీ కొందరు మాత్రం ఎప్పుడు మొటిమలతో తెగ ఇబ్బందిపడిపోతూ ఉంటారు. మొటిమల కారణంగా నల్లమచ్చలు ఏర్పడుతూ అందవికారంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మొటిమల నుండి నల్లమచ్చల నుండి ఎలా బయటపడాలో తెలుసుకుందాం..
యాపిల్ సైడర్ వెనిగర్
ఒక గిన్నెలో ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ మరియు రెండు స్పూన్ల నీటిని కలుపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్ర పడుకునేముందు మొటిమలపై అప్లై చేసి ఉదయం శుభ్రంగా కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది.
తేనె ఉల్లిపాయ రసం
ఉల్లిపాయ నుండి రసం తీసి ఒక స్పూన్ మరియు తేనె ఒక స్పూన్ తీసుకుని బాగా మిశ్రమంగా చేసుకోవాలి. ఆ తర్వాత మొటిమలు మరియు నల్లని మచ్చలపై రాసుకుని ఒక అరగంట తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇంకా వీలైతే సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
పసుపు నిమ్మరసం
ఒక టేబుల్ స్పూన్ పసుపు, మరో టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొతిమలపైనే కాకుండా నల్లగా ఉన్న చర్మంపై మరియు పేస్ ప్యాక్ గా కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వలన మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా ఉంటుంది.
అరటిపండు
అరటిపండు తొక్క లోపలి భాగాన్ని మొతిమలపై మర్దనా చేసుకుని 20 నిముషాల తర్వాత ముఖాన్ని బాగా కదిగేసుకోవడం వలన మొటిమలు నల్లమచ్చలు తగ్గి ముఖం అందంగా ఉంటుంది.
శనగపిండి పెరుగు
కొద్దిగా శనగపిండి తీసుకుని అందులో కాస్త పెరుగు కలిపి మొటిమలపై రాసుకుని అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలకు చెక్ పెట్టవచ్చు.
మహిళలకు ఉపయోగపడే ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా SHARE చేయండి.