ఉత్తమమైన భార్యకు ఉండాల్సిన 6 లక్షణాలు ఇవే…

భార్య అంటే అందంగా ఉండాలి, రుచికరంగా వండి పెట్టాలి, ఎప్పుడు భర్త గురించే ఆలోచిస్తూ ఉండాలి, పడక గదిలో మంచి సుఖాన్ని ఇవ్వాలి..  ఇలా మన భారతీయ  వివాహ సాంప్రదాయాల ప్రకారం, కొన్ని కుటుంబాలలో ఉన్న ఆలోచనలు. భర్తతో భార్య ఎలా నడుచుకోవాలి అనే విషయాలు  మీకు చాలామందే చెప్పి ఉంటారు  కానీ మీ భర్తకు మీరు పర్ఫెక్ట్ వైఫ్ అని చెప్పే లక్షణాలు ఇక్కడ మీకోసం… 

మీ ఆయనకు కాస్త సమయం ఇవ్వాలి

భార్యకు ఎప్పుడు భర్త పక్కనే ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ మీ ఆయనకు మీరే కాకుండా ఆయనకు కొన్ని ఇష్టమైనవి ఉంటాయి, ఫ్రెండ్స్ తో ఉండాలని, బిజినెస్ బాగా డెవలప్ చేయాలని, కొంత సమయం ఒంటరిగా గడపాలని బయటకు చెప్పుకోలేని విషయాలు ఉంటాయి. భార్యగా మీరే అర్థం చేసుకోవాలి. కానీ మీరంటే మీ భర్తకు ఎంత ఇష్టం అంటే ఎక్కడ ఉన్నా సాయంత్రానికి త్వరగా ఇంటికి చేరాలి. నా భార్య నాకోసం ఎదురుచూస్తూ ఉంటుందని వస్తాడు.

మీరే బెస్ట్ ఫ్రెండ్

Image Source : stories

పెళ్లి తర్వాత భర్తకు ఎంతమంది ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా మీరే బెస్ట్ ఫ్రెండ్ గా మీ ఆయన ఫీలవుతాడు. ఎవరితో చెప్పుకోలేని విషయాలు మీతో చెప్పుకుంటాడు కానీ ఇల్లు ఇలా ఉండాలి, పిల్లలను ఇలాగే చూసుకోవాలి, ఆ వస్తువు ఇక్కడ పెట్టాలి అని చెప్పడు. ఎందుకంటే మీరు బాధపడతారని. కానీ మీరు ఇంటిని చాలా కొత్తగా, పిల్లలను మీ ఆయన గర్వించేలా ఉంటే ఆనందిస్తాడు.

మీ ఆయనతో తప్పకచెప్పాలి

కొందరు భర్తలతో కొన్ని విషయాలు చెబితే ఏమనుకుంటారో అని లోలోపలే ఆలోచిస్తూ మదనపడుతూ ఉంటారు. కానీ మీ మనసులో ఏదైనా ఉంటే వెంటనే చెప్పండి. అది కష్టమైతే వద్దని చెబుతాడు, కష్టంగా ఉన్నాసరే మీరు అడిగారు కదా అని ఇష్టంగా చేస్తారు. ఎందుకంటే మీరు ఏది దాచుకోకుండా చెప్పడమే మీ ఆయనకు నచ్చుతుంది.

నమ్మకం ఉంచాలి

ఏ బంధం అయినా స్ట్రాంగ్ గా ఉండాలంటే అందుకు నమ్మకమే గట్టి పునాది. అది భార్యభర్తల బంధంలోనూ ఉంటుంది. మీరు మీ ఆయనను నమ్మడం, మీ ఆయన మిమ్మల్ని నమ్మడం చేస్తేనే మీ రిలేషన్ అందంగా ఉంటుంది. అలా కాకుండా ప్రతి విషయంలోనూ అనుమానం పడి మీ ఆయనపై చిరాకు చెందటం వలన మీ దాంపత్యమే ఇబ్బందుల్లో పడుతుంది.

ఒకే విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు

మీరు మీ ఆయనకు పర్ఫెక్ట్ వైఫ్ అని చెప్పడానికి మీ ఇద్దరి ఆలోచనలు, ఇష్టాలు ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదు. అయితే మీరు కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవడం రాదని విమర్శించడం, మీకన్నా నేనే గొప్ప అని మీ ఆయన ముందు అనటం వారికి ఇష్టం ఉండదు. వారికే కాదు ఎవరికీ ఇష్టం ఉండదు. ముఖ్యంగా భార్యభర్తల గొప్ప, తక్కువ అనే మాటలు అస్సలు ఉండకూడదు.

సానుకూలంగా స్పందించడం

మీ ఆయనకు ఉన్నట్లుండి ఉద్యోగం పోయినా, బిజినెస్ లో నష్టం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా కానీ మీరు సానుకూలంగా స్పదించాలి. ప్రేమను, ఆప్యాయతను అందించాలి. నేనున్నాను అనే మనోధైర్యం ఇవ్వాలి. అలాగే మీ ఆయనను సంతోషంగా ఉంచాల్సిన పెద్ద బాధ్యత మీదే. మీ నవ్వులోనే మీ ఆయన నేను సాధించగలను నమ్మకాన్ని వెదుక్కుంటాడు.

ఇది చదివాక మీ భర్తకు మీరు ‘పర్ఫెక్ట్ వైఫ్’ అనిపిస్తే మీ ఆయనకు వెంటనే SHARE చేయండి.  ఎందుకంటే మీ భర్త చెప్పడు. 

Leave a Reply

%d bloggers like this: