కడుపులోని బిడ్డ ఆడ, మగ అని తెలిపే 5 పరీక్షలు : ఇంట్లోనే తెలుసుకోవచ్చు

గర్భవతిగా ఉన్నప్పుడు తమకు పుట్టబోయేది మగ బిడ్డ ఆడ బిడ్డ అని తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి భార్యభర్తలలో ఉండటం సహజమే.  అయితే ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ విషయాల ద్వారా మీకు పుట్టబోయేది ఆడ బిడ్డ లేదా మగ బిడ్డ అనేది తెలుసుకోవచ్చు.

గుండె స్పందన రేటు

మీరు చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు బిడ్డ భ్రూణ హృదయ స్పందన రేటు నిముషానికి 140 సార్లు కొట్టుకుంటుంటే ఆడ బిడ్డగా,  140 సార్ల కంటే తక్కువగా కొట్టుకుంటుంటే మగ బిడ్డగా గుర్తించాలి.

వాంతులు రాకుండా ఉంటే

గర్భవతిగా ఉన్నప్పుడు కొందరిలో ఉదయాన్నే వారి శరీరం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే వారిలో వాంతులు కూడా రావు.  ఇటువంటి సూచనలు ఉంటే గర్భం సాఫీగా జరుగుతుంది మరియు ఆడ పిల్ల జన్మిస్తుంది.

మూత్రం రంగు

మూత్రం రంగు ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మూత్రం పసుపు రంగులో వస్తుంటే మగ బిడ్డ, అదే రంగు తక్కువగా ముదురు పసుపు రంగులో మూత్రం వస్తుంటే ఆడ పిల్ల పుడుతుందని చెబుతారు.

స్వీట్స్ ఎక్కువగా తింటే

గర్భం సమయంలో మహిళ ఎక్కువగా స్వీట్స్ తినడం, ఐస్ క్రీమ్స్ తినడం చేస్తుంటే ఆడ పిల్ల అని, ఉప్పుగా ఉన్న పదార్థాలు, మసాలా ఫుడ్స్ తింటుంటే మగ బిడ్డగా గుర్తించాలి.

గర్భం సైజును బట్టి

పుట్టబోయేది ఆడ బిడ్డ లేదా మగ బిడ్డ అనేది గర్భంతో ఉన్న మహిళ పొట్టను బట్టి చెప్పవచ్చు. పొట్ట పై భాగంలో అధికంగా పొడుచుకు వస్తుంటే, పక్కవైపు ఎక్కువగా ఉంటే ఆడపిల్ల అని, అదే పొట్ట దిగువ భాగంలో బయటకు పొడుచుకు వస్తున్నట్లుగా ఉంటే మగ బిడ్డ అని చెబుతారు.

రింగ్ టెస్ట్ లేదా కీ టెస్ట్

ఉంగరం లేదా కీ ని తీసుకుని ఒక దారానికి కట్టాలి. అలా కట్టిన ఉంగరాన్ని బొడ్డుపై చూపి అది గుండ్రంగా తిరిగితే ఆడబిడ్డగా, తిరగకపోతే మగ బిడ్డగా చెప్పవచ్చు.

గర్భం అందంగా లేకపోతే

సాధారణంగా మన పురాణాల ప్రకారం పుట్టబోయేది ఆడబిడ్డ ఐతే తన తల్లి అందాన్ని దొంగిలిస్తుంది అని చెబుతారు. దీని ప్రకారం తల్లి గర్భం కనుక ప్రకాశవంతంగా కనిపించకపోతే ఆడబిడ్డే అని చెబుతారు.

నిద్రను బట్టి

గర్భంతో ఉన్నప్పుడు నిద్ర ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మీరు ఎప్పుడు ఎడమ వైపు పడుకోవడం లేదా ఎడమవైపు నిద్రలేస్తున్నట్లయితే ఆడబిడ్డ అని, అదే కుడివైపు తిరిగి పడుకున్నట్లయితే పుట్టబోయేది మగ బిడ్డగా చెప్పవచ్చు.

చేతుల ఆధారంగా

గర్భంతో ఉన్న మహిళ చేతులు పొడిగా మరియు చీలినట్లుగా ఉంటే మగపిల్లాడు, అదే మహిళ చేతులు సుతిమెత్తగా మృదువుగా ఉన్నట్లయితే ఆడ బిడ్డగా గుర్తించాలి.

వక్షోజాల సైజును బట్టి

శరీరంలో జరిగే హార్మోన్ల అసమతుల్యత మార్పుల కారణంగా ప్రతి భాగం ఒకే విధంగా ఒకే సైజులో ఉండదు. అలా గర్భంతో ఉన్నప్పుడు ఎడమవైఫు ఎద భాగం ఎక్కువ మోతాదులో ఉంటే మగ బిడ్డ అని, అదే కుడివైపు ఎక్కువగా ఉంటే ఆడపిల్లగా చెబుతారు.

ఇక్కడ చెప్పుకునే ఈ పరీక్షల ద్వారా పుట్టబోయేది ఆడ బిడ్డనా లేదా మగ బిడ్డనా అని మన పెద్దలు చెబుతూనే ఉన్నారు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

పిల్లల కళ్ళకు కాటుక పెట్టవచ్చా..? అసలు నిజం ఏంటో తెలుసుకోండి.

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: