పెళ్లి అయిన తర్వాత మహిళలే ఎందుకు లావు అవుతారో మీకు తెలుసా..!! అసలు నిజం ఇదే

పెళ్లి తర్వాత చాలామంది మహిళలు లావు అవుతుంటారు. దీనికిగల కారణం ఏంటనేది? ఇప్పటికీ చాలామందిలో ప్రశ్నగానే  మిగిలి ఉంది.  పెళ్లి తర్వాత మహిళలే లావు కావడానికి కారణం ఏంటి? అందుకు తీసుకోవాల్సిన పరిష్కారాలేంటో  వివరంగా తెలుసుకుందాం..

లావు కావడానికి కారణాలు :
ఆహారంలో మార్పులు

పెళ్లి తర్వాత దంపతులు లావు కావడానికి కారణాలలో మొదటిది తీసుకునే ఆహారంలో మార్పులు. మగాళ్లు పెళ్లి అయిన కొద్ది రోజుల్లో లావు  అయినా ఆ వెంటనే తగ్గిపోతారు. కానీ మహిళలు తమ ఇంటి నుండి కొత్త ఇంటికి వచ్చి ఆహారపు అలవాట్లలో, వారు అంతకుముందు తీసుకున్న ఫుడ్ టైమింగ్స్ లో తేడా రావడం లావు కావడానికి కారణం.

ఒత్తిడి

పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మహిళల ఆలోచనలలో చాలా తేడా వస్తుంది. కుటుంబం మొత్తం గురించి ఆలోచించాలి, ఆఫీస్, పని ఒత్తిడి కారణంగా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, బయట ఫుడ్స్ ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయ్యాక హానీ మూన్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఆయిల్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం కూడా ఒక కారణం.

అలా చేస్తే లావు పెరుగుతారా?

అందరిలోనూ ఈ అపోహ ఉంది. పెళ్లి తర్వాత లావు కావడానికి రిలేషన్ షిప్ లో ఉండటం వలనే అని. కానీ అందులో నిజం లేదు. ఇద్దరూ ఏకాంతంగా పాల్గొన్నప్పుడు హార్మోన్ల అసమతుల్యత కారణంగా లావు పెరగడానికి కారణం. అలాగే వక్షోజలలో మార్పులు, నడుంచుట్టూ కొవ్వు చేరడానికి కారణం కూడా.

డైట్  వ్యాయామం

పెళ్లికి ముందు మహిళలు ఎక్సర్ సైజెస్, వర్కౌట్స్ చేసి ఉండవచ్చు లేదా న్యూట్రిషన్స్ ఫుడ్స్ తీసుకుని ఉండవచ్చు. అదే పెళ్లి తర్వాత వర్కౌట్స్ చేయడానికి తగిన సమయం ఉండదు, అలాగే సరైన డైట్ మైంటైన్ చేయలేకపోవడం మహిళలు లావు కావడానికి కారణాలు. అంతేగానీ ఎక్కువ తింటున్నారనో లేక బద్ధకంగా ఉన్నారనో అనుకోకండి.

లావు తగ్గడానికి పరిష్కారాలు :
ఒత్తిడి తగ్గించుకోవాలి

పెళ్లి తర్వాత మహిళలలో ఎక్కువ ఒత్తిడి, భయాందోళన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఒత్తిడి తగ్గించుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఎంత బిజీగా సరైన సమయానికి క్రమం తప్పకుండా తినడం చేయాలి.

వ్యాయామాలు

ప్రతి రోజూ ఎన్నో పనులు పెళ్లి తరవాత మహిళలకు ఉండటం సహజమే. ఈ పనులలో పడి తమ శరీరంపై కచ్చితమైన శ్రద్ధ తీసుకోలేరు. అందుకని ఇప్పటినుండే క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒక అరగంట పాటు వ్యాయామాలు చేయడం చేయాలి.

నిమ్మరసం తేనే

ఒక గ్లాస్ నిమ్మరసంలో రెండు స్పూన్ల తేనే కలిపి ప్రతిరోజూ ఉదయం తాగడం వలన బరువు, ఒంట్లో చేరుకున్న కొవ్వును తగ్గిస్తుంది.

ఓట్ మీల్

ఉదయాన్నే ఎక్సర్ సైజెస్ మీ డైలీ డైట్ లో భాగంగా ఓట్ మీల్ తినడం వలన బరువు తగ్గి అందమైన, ఆకర్షణీయమైన శరీరం మీ సొంతం అవుతుంది. ఒంట్లో ఉండే కొవ్వును దూరంచేయగల శక్తి వీటికి ఉంది.

నీరు

మిమ్మల్ని ఒత్తిడి నుండి స్ట్రెస్ నుండి దూరం చేయగల శక్తి నీటికి మాత్రమే ఉంది. రోజులో ఎంత నీరు తీసుకుంటే శరీరానికి అంతమంచిది. బాడీ డీ హైడ్రేషన్ కాకుండా ఉంచుకోవాలి. శరీరం బాగా ఫ్రీగా ఉండేలా చేయడంలో   నీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది.

పండ్లు, కూరగాయాలు

పెళ్లి అయిన మీ శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరడం వలన లావు పెరిగారు అనిపించినట్లయితే మీరు వెంటనే ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మానేసి పండ్లు, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం చేయాలి. ఇలా చేయడం వలన తక్కువ రోజుల్లోనే మీ శరీరంలో అందమైన మార్పులను గమనించవచ్చు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT  చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

ఎలాంటి ఆడవాళ్ళను మగవాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు

Leave a Reply

%d bloggers like this: