భార్యకు ఈ 4 రహస్యాలు తెలియాలని ప్రతి భర్త కోరుకుంటాడు

ఎక్కడో పుట్టి, ఎవరో కూడా తెలియకుండా దాంపత్య బంధం వలన మగ, ఆడ అనే పదాల నుండి భార్యభర్తలుగా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే అయినా తమ భార్య తమ గురించి ఈ 4 రహస్యాలను తెలుసుకోవాలని ప్రతి భర్త కోరుకుంటాడు. అలా ఎందుకు కోరుకుంటాడో తెలుసా..! ఇది చదివిన తర్వాత తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలుపడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం త్వరగా చదవండి.

1.మగాళ్లు చాలా రొమాంటిక్

మగవారు చాలా రొమాంటిక్ అనగానే అదే అనుకోవడం తప్పు. ఎందుకంటే ఏ పనిచేసినా సరే వారు తమ ప్రేమను తమ చేతల్లోనే చూపిస్తారు కానీ త్వరగా మాటల్లో చెప్పలేరు. మీకు ఏదైనా కష్టం వస్తే మీరు చెప్పకుండానే సాల్వ్ చేస్తారు. మీరు ఏదైనా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా, సంకోచిస్తున్నా సరే అందరికంటే బాగా అర్థం చేసుకునేది మీ భాగస్వామి అయిన మీ భర్త మాత్రమే. మీ కష్టాన్ని కూడా ఎంతో ఇష్టంగా చేయగల సామర్థ్యం, ఓపిక ఒక్క భర్తకు మాత్రమే ఉందని మీరు గుర్తించాలి. అదే వారు మీపై చూపించే ప్రేమ. మాటలతో చెప్పలేకపోయినా చేతల్లో ఎంత బాగా చేస్తారో అర్ధమయ్యే ఉంటుంది కదా. అందుకే మగాళ్లు చాలా రొమాంటిక్.

2.మగవారు పర్ఫెక్ట్ కాదు

ఎస్. మీరు అనుకున్నది నిజమే మగాళ్లు ఏ విషయంలో పర్ఫెక్ట్ కాదు అని మహిళలు అనుకోవడం నిజమే. ఎందుకంటే తమ జీవితంలోకి వచ్చిన భాగస్వామికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని, తమ వల్ల ఎటువంటి బాధపడకూడదు అని ఆలోచిస్తారు కాబట్టి మగవారు పర్ఫెక్ట్ కాదు. వారి చిన్నతనం నుండి తన తల్లితండ్రుల నుండి సమాజం నుండి తెలుసుకున్న కొన్ని అనుభవాల వలన ఒక్కోసారి పక్కదారి పట్టాల్సి వస్తుంది. అటువంటప్పుడు మీరు మీ ఆయనకు వివరంగా, అర్ధమయ్యేలా చెప్పడం చేయాలి. ఎందుకంటే తను వెళ్లేదారి, తాను తీసుకున్న నిర్ణయం సరైనదే అని అతను అనుకుంటున్నప్పుడు తప్పేదో ఒప్పేదో చెప్పాల్సిన బాధ్యత భార్యగా మీకే ఉంటుంది.

3.మగవారు మీ ఆనందాన్నే కోరుకుంటారు

ప్రతి ఒక్కరి జీవితంలో రిలేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ రిలేషన్ లలో చాలా స్ట్రాంగ్ గా ఉండేది భార్యాభర్తల బంధం. అందుకని ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఆర్ధిక సమస్యలు ఉన్నా, ఒత్తిడి ఉన్నా, కుటుంబ సమస్యలు ఉన్నా అవన్నీ భార్యతో గానీ ఇంకొకరితోగానీ చెప్పుకోకుండా తన భార్య, తన పిల్లలు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. అయితే ఒక సహధర్మచారిగా మీ ఆయన ఆనందం మీ ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని ఆ విధంగా నడుచుకోవడమే ఆయనకు   కలిగే అత్యంత సంతోషం.

4.మగాళ్లు సంతోషంగా ఉండాలనుకుంటారు

తమ భార్య ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటారో భర్తలు కూడా జీవితాన్ని చాలా సంతోషంగా గడపాలని కోరుకుంటారు. అయితే కుటుంబం అనేది వారి జీవితంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా పనిచేయడం, ఆఫీస్ లో ఎక్కువ సమయం గడపడం చేస్తుంటారు. అందుకు వారిని ఇబ్బంది పెట్టకుండా వారిని అర్థం చేసుకుని ప్రోత్సహించడం చేస్తే వారికి కలిగే ఆనందమే వేరు. అలాగే భర్తలు తమ ఇష్టాలను, తమ అలవాట్లను మిస్ అవుతున్నప్పుడు భార్యగా మీరే దగ్గరుండి వారి అలవాట్లలో భాగం కావడం, ఇష్టాలను తెలుసుకోవడం వలన మగవారు ఆనందంగా ఉంటారు.

మగ, ఆడ అనే పదాలు వేరు, మనసులు వేరైనా వారిద్దరినీ పెళ్లి ఒక్కటి  చేస్తుంది కాబట్టి. ఇక్కడ మగ, ఆడ అనే ఆలోచన పక్కన పెట్టి మనం ఒక్కటి అనే ఆలోచన ఉంటే ఆ భార్యాభర్తల జీవితం ఎప్పటికీ ఆనందమయమే. 

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.  

Leave a Reply

%d bloggers like this: