మీ భర్తను మీరు పేరుపెట్టి పిలిస్తే మీ భర్తకు ఏమైనా అవుతుందా? అసలు నిజం ఇదే..

మన సాంప్రదాయం ప్రకారం భార్య భర్తను పేరుపెట్టి పిలవకూడదు అని అంటారు.  కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం చాలావరకు  భర్తను పేరుతో పిలిచే ఆనవాయితీని పాటిస్తున్నారు. మరికొందరు భార్యలు తాము పిలిచినప్పుడు పలుకకపోతే అరేయ్..ఒరేయ్ అని కూడా పిలుస్తున్నారు.  మరి భార్య భర్తను ఎలా  పిలవాలో తెలుసుకోండి.

ఒంటరిగా ఉన్నప్పుడు

హిందూ సాంప్రదాయం ప్రకారం అగ్ని ప్రమాణం సాక్షిగా వివాహం చేసుకుని భర్తను భార్య పేరుపెట్టి పిలవడం అమర్యాద. అలాగే పదిమందిలో భర్తను భార్య పేరుపెట్టి పిలవడం వలన ఆయనకు భార్య నుండి గౌరవం లేదు అని అనుకుంటారు. అదే ఒంటరిగా, ఏకాంతంగా ఉన్నప్పుడు ఇద్దరిమధ్య ప్రేమ ఉంటుంది కాబట్టి ఎలా పిలుచుకున్నా ఫర్వాలేదు.

భర్తను భార్య ఎలా పిలవాలి? 

మన పురాణాలను బాగా నిశితంగా పరిశీలిస్తే బిడ్డ ముందు తల్లి పేరును జత చేశేవారు కానీ ఇప్పుడు అలా లేదు కాబట్టి. భర్తను భార్య శ్రీవారు, ఏవండీ, బావ.. ఇలా పిలవడం చేయవచ్చు. ఇంకా ఆప్యాయంగా, గౌరవంగా మా ఆయన గారు అని కూడా పిలవవచ్చు.

భార్యకు గౌరవం

భర్తను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా భార్య తట్టుకోలేదు అటువంటిది భార్యే భర్తను గౌరవం లేకుండా చేస్తే ఇక మిగతావారు ఏమంటారో ఆలోచించుకోవాలి. అలాగే తమ బిడ్డను కోడలు పేరుతో పిలవడం వలన వారు బాధపడతారు కూడా. ఇది కూడా భార్యలకు అంత గౌరవం కాదు. మీ గౌరవాన్ని పెంచే మీ భర్తను అందుకే పేరుతో పిలవకూడదని చెబుతారు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా,   ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

పిల్లలు పుట్టిన తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే…: ముందే తెలుసుకోండి

Leave a Reply

%d bloggers like this: