శరీరం నుండి వచ్చే దుర్వాసన గురించి అందరూ బయటకు చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా, భయంగా ఉంటారు.
అయితే ఇది సాధారణమే కదా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ముందుముందు చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. శరీరం నుండి వచ్చే ఆ ప్రమాదకర దుర్వాసనలు ఏంటో మీరే చూడండి.
నోటి దుర్వాసన
ఇది ప్రతి ఒక్కరిలో ఉండే సమస్యే కానీ ఎవరూ బయటకు చెప్పుకోరు. నిద్ర లేచిన తర్వాత చాలామంది నోటి దుర్వాసన సమస్యను ఎదుర్కుంటూ ఉంటారు. బ్రష్ చేసిన కూడా అలానే వాసన ఉంటుంది. కొన్ని కొన్ని నిద్ర మెలకువకు కారణం కూడా నోటి దుర్వాసనే అని చెప్పొచ్చు. నిద్ర మధ్యలో తేపులు రావడం, గొంతులో ఇబ్బందిగా ఉండటం వలన నిద్రకు భంగం కలిగిస్తుంది. అందుకే ఈ సమస్య నుండి బయటపడాలంటే రోజుకి రెండు సార్లు బ్రష్ చేయాలని చెప్పేది.
చంకలలో దుర్వాసన
ఒకరోజు స్నానం చేయకపోయినా, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు లేదా ఎండలో తిరిగినప్పుడు వెంటనే చంకలలో చెమట మొదలై దుర్వాసన కలిగిస్తుంది. ఇది పక్కవారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ప్రతిసారీ చమటను శుభ్రం చేసుకోలేరు కాబట్టి స్నానం చేసేముందు శరీరం నుండి దుర్వాసన రాకుండా చేసే కొన్ని పదార్థాలను ఉపయోగించాలి. లేకపోతే స్కిన్ అలర్జీకి దారి తీస్తుంది.
గ్యాస్ దుర్వాసన
మీరు తీసుకునే త్వరగా జీర్ణం అయ్యేది అయితే ఈ సమస్య ఉండదు కానీ మసాలా ఫుడ్స్, డైరీ ప్రాడక్ట్స్, ఆయిల్ ఫుడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వలన గ్యాస్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య ప్రతి ఒక్కరిలోనూ ఉండేదే కదా అని నిర్లక్ష్యం చేయడం వలన ఉదర సమస్యలు, కిడ్నీ సమస్యలు, ఛాతీలో నొప్పి బాధిస్తుంది. అలాగే నలుగురితో కలిసి ఎక్కడికి వెళ్ళలేరు మరియు రాత్రిపూట ఇది ఎక్కువైతే నిద్రకు భంగం కలుగుతుంది.
యూరిన్ దుర్వాసన
మగవారితో పోల్చితే మహిళలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వలన వచ్చే దుర్వాసనను ఎవరికివారే భరించడం చాలా కష్టం అవుతుంది. అందుకే యూరిన్ చేసిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉండటం, లేదా బాగా క్లీన్ చేసుకోవడం చేయాలి. లేకపోతే మీ జననాంగాలు ఇన్ఫెక్షన్స్ బారిన పడే ప్రమాదం ఉంది.
పాదాల దుర్వాసన
ప్రతి పది మందిలో ఏడుమంది ఈ సమస్యను ఎదుర్కుంటున్నారు. సాక్స్ లేకుండా షూస్ ధరించినప్పుడు, షూ సాక్స్ సరిగ్గా శుభ్రం చేసుకోకుండా ధరించినప్ప్పుడు, నాసిరకం చెప్పులు వేసుకున్నప్పుడు లేదా పాదాలను శుభ్రంగా కడుక్కోనప్పుడు పాదాల నుండి వచ్చే దుర్వాసనను భరించడం చాలా కష్టం. మీకు ఎలా ఉంటుందేమో కానీ పక్కవారికి వాంతులు అయ్యేలా ఉంటుంది. అలాగే మీకు చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకండి.
ఇంకా శరీరం నుండి వచ్చే ప్రమాదకరమైన దుర్వాసనలు ఏమైనా ఉన్నాయా? వీటికి ఎటువంటి చికిత్స మంచిదో మీరు మాకు COMMENT సెక్షన్ లో తెలుపవచ్చు.
ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.