పిల్లలకు మాటలు త్వరగా రావాలంటే.. ఏం తినిపించాలి? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

పిల్లలు త్వరగా మాట్లాడితే చూడాలని ప్రతి తల్లితండ్రులు కోరుకుంటారు. సాధారణంగా పిల్లలు ఒకటి లేదా రెండు సంవత్సరాల తర్వాత మాట్లాడటానికి అలవాటు పడతారు. పాకడం, నడవడం, దొర్లడం ఏ విధంగా అయితే చేస్తారో మాట్లాడటం కూడా అదే విధంగా చేయడానికి పిల్లలు అలవాటు పడాలి.  పిల్లలు త్వరగా మాట్లాడుకుంటే వినికిడి శక్తి లోపమా? గ్రహించడం లేదా? అని కంగారుపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పుకునే విధంగా చేయడం వలన పిల్లలు త్వరగా మాట్లాడగలరు.

మాట్లాడుతూ ఉండాలి

తల్లి కడుపులో ఉన్నప్పుడు కొన్ని నెలల తర్వాత బిడ్డ తల్లి చెప్పే మాటలు, చుట్టుపక్కల జరిగే విషయాలను గ్రహించగల శక్తి ఉంటుంది. అలాగే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత తల్లి ఎప్పుడూ బిడ్డతో మాట్లాడటం లేదా పక్కవారితో మాట్లాడటం చేస్తూ ఉండటం వలన పిల్లలకు గ్రహించేశక్తి, వినికిడి శక్తి బాగా ఉంటుంది  కాబట్టి వారుకూడా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు.

పేర్లు చెప్పించాలి

తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత తల్లి స్పర్శను, తల్లి మాటలనే పిల్లలు త్వరగా గుర్తించగలరు. అలాగే అమ్మ అనే మాటనే ముందుగా పలుకుతాడని అందరికీ తెలిసిందే. అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ, మామ పదాలను ఎప్పుడు చెబుతూ ఉండటం వలన ఆ పదాలు త్వరగా గుర్తుపెట్టుకుంటారు. చెప్పడానికి ప్రయత్నిస్తారు.

బొమ్మలతో ఆడిస్తూ ఉండాలి

పసిపిల్లలకు చిన్నతనంలో అమ్మ తర్వాత మంచి నేస్తం ఎవరైనా ఉన్నారంటే అవి ఆట వస్తువులు, బొమ్మలే. బొమ్మల పేర్లు, ఆట వస్తువుల పేర్లు పిల్లలకు   వాటిని పట్టుకోమని లేదా తీసుకురామని చెప్పడం చేస్తే వారికి బాగా గుర్తు ఉంటుంది.

ఇష్టమైన ఫుడ్

పిల్లలకు 6 నెలల తర్వాత నుండి ఆహారం తినిపించడం చేయాలి. అలాగే ఏ ఆహారం తినిపిస్తున్నారో వారికి చెప్పాలి. నీకు  ఈ రోజు ఇది చేసి పెట్టనా?, ఏం తింటావు అని అడుగుతూ ఉండాలి. ఒకవేళ ఆహారాన్ని గ్రహించలేకపోతే చేతులతో చూపిస్తూ ఉండాలి.

భాష నేర్పించాలి

పిల్లలకు మాతృభాష త్వరగానే అర్థం  అవుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. అయితే మాతృభాష ఏదయితో ఉందో వాటిలోని పదాలను ప్రతి రోజూ చెప్పడం, తప్పుగా చెబుతుంటే తప్పులు సరిదిద్దడం వలన భాషపై పట్టువస్తుంది మరియు త్వరగా మాట్లాడగలరు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

బ్రెయిన్ ఫుడ్స్ : పిల్లల బ్రెయిన్ పవర్ పెంచే 10 అద్భుతమైన ఆహారాలు

Leave a Reply

%d bloggers like this: