డెలివరీ తర్వాత తినకూడని 5 ఆహారాలు : తల్లి, బిడ్డకు ప్రమాదకరం

గర్భం దాల్చడం, ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మను ఇవ్వడం అనేది మహిళలకు దక్కే అదృష్టంగా చెబుతారు. మాతృత్వంలో అంత గొప్పదనం ఉంటుందని స్త్రీకి తల్లి అయిన తర్వాతే తెలుస్తుంది. అయితే గర్భం సమయంలో శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు మహిళ ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో,  ప్రసవం తర్వాత బాలింత సమయంలో కూడా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే తల్లి ఆహారం, తల్లి ఇచ్చే పాలపైనే బిడ్డ ఎదుగుదల,  ఆరోగ్యం ప్రభావం చూపిస్తుంది కాబట్టి. ఇంతకీ  ఆ ఆహారాలేంటో తెలుసుకోండి.

వేరు శనగ

వేరు శనగను బాలింతలు తీసుకోకూడదు. ఎందుకంటే బిడ్డకు అలర్జీని కలిగిస్తుంది. వీటిలో పోషక విలువలు ఉన్నప్పటికీ బిడ్డకు  పాలిస్తున్న తల్లి నట్స్ వంటి ఆహారాలను తీసుకోవడం వలన పిల్లలకు అలర్జీలు వచ్చి ఇబ్బందిని కలిగిస్తాయి.

కాఫీ

గర్భం సమయంలోనూ కాఫీకి దూరంగా ఉండాలని చెబుతారు. అలాగే ప్రసవం తర్వాత కూడా కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ తీసుకోవడం వలన తల్లి, బిడ్డకు నిద్రేలేమిని కలిగిస్తాయి. అందుకే వైద్యులు కూడా కాఫీ వద్దని చెబుతుంటారు.

వెల్లుల్లి

బాలింతలు, పాలిచ్చే తల్లులు వెల్లుల్లి ఎక్కువగా ఉండే ఆహారం, వెల్లుల్లిని తీసుకోవడం వలన తల్లి పాలు తాగే బిడ్డకు పాల నుండి వచ్చే ఘాటైన వాసన కారణంగా పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు వారిలో వికారం మొదలై వాంతులు వచ్చే ప్రమాదం ఉంది.

పెరుగు

చాలావరకు వైద్యులు బాలింతలను పెరుగు కొన్ని నెలల పాటు వద్దని చెబుతుంటారు. తల్లి పెరుగు తీసుకోవడం వలన తల్లి పాలలో కలిసి బిడ్డకు జలుబు చేస్తుందని చెబుతుంటారు. అలాగే మరికొందరిని పాలకు కూడా దూరంగా ఉండమని అంటారు. ఎందుకంటే డైరీ ప్రాడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం వలన బిడ్డకు అలర్జీలు, శరీరంపై మంటగా ఉండటం, విసుగుగా ఉంటుందని చెబుతారు. అయితే ఈ విషయంలో మీరు వైద్యుల సలహా తీసుకోమని చెప్పాలి .

చాక్లెట్స్

పాలిచ్చే తల్లులు చాక్లెట్స్ తీసుకోవడం వలన వీటిలో ఉండే కెఫీన్ మరియు సోడా తల్లి, బిడ్డ శరీరంలో  చేరి మంచి నిద్రను దూరం చేస్తాయి.

ఇంకా మసాలా ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, కొన్ని రకాల చేపలు, మద్యం, పెప్పర్ పదార్థాలు, గోధుమలు, బ్రోకలీ, ధూమపానం చేయడం,  చేసేవారి పక్కన ఉండటం, ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారం, డాక్టర్ ఇచ్చిన మందులు కాకుండా సొంతంగా మందులు తీసుకోవడం చేయకూడదు. ఈ సమయంలో మీ బిడ్డ వందేళ్ల జీవితం మీ చేతుల్లో ఉంటుంది, కాబట్టి అందరికీ SHARE చేయండి.

ఇవి కూడా చదవండి. 

తల్లులు పిల్లలను కనడం కోసం ఏమైనా చేస్తారు అని రుజువుచేసే 10 ఫోటోలు : తల్లి కడుపుకోత తెలుస్తుంది

Leave a Reply

%d bloggers like this: