మీ భర్త ఈ రహస్యాలను ఎప్పుడు మీతో చెప్పరు..మీరే అడిగిమరీ తెలుసుకోండి

ప్రతి ఒక్కరికీ ఒక రహస్యం జీవితం ఉంటుంది. అది చాలావరకు ఎవరితో చెప్పుకోరు. అలాగే మీ భర్త కూడా కొన్ని రహస్యాలను భార్యతో ఎప్పటికీ చెప్పుకోలేడు. మీరు బాధపడతారనో, మీకు తెలిస్తే బాగుండదనో కానీ ఎందుకో చెప్పలేడు.  అయితే ఆ రహస్యాలను మీరు అడిగితే మాత్రం తప్పకుండా చెబుతాడు. ఇంతకీ ఆ రహస్యాలేంటో మీరే తెలుసుకోండి.

ఆదాయం

మీ భర్త ఎంత సంపాదిస్తున్నా మీకు, మీ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమకూరుస్తాడు. అయితే ఆయన ఏం చేస్తున్నారు, అతను డబ్బు సంపాదనతో ఇబ్బంది ఏమైనా ఎదుర్కుంటున్నాడా?, పిల్లలకోసం పొదుపు చేస్తున్నాడా? లేదా నేనేమైనా ఉద్యోగం చేసి మీకు తోడుగా ఉండాలా అని అడగటం తప్పేమీ కాదు.

అత్త మామలు ఏమనుకుంటున్నారు?

కొడుకు దాంపత్య జీవితం ఎలా ఉందని ప్రతి తల్లితండ్రులు తెలుసుకోవాలనుకుంటారు. కోడలిగా అది మీపైనే ఆధారపడి ఉంటుంది. మీరు వాళ్ళతో సరిగ్గా ఉంటే నా కోడలు చాలా మంచిదని అందరితో చెప్పుకుంటారు. అయితే కొన్నిసార్లు చెప్పలేక మీ ఆయనతో అంటుంటారు. అందుకని అత్తమామలకు నేను ఎలా ఉండటమంటే ఇష్టమో చెప్పండి అలా ఉంటాను అని అడగాలి.

పిల్లల ఆరోగ్యం

ఎప్పుడైనా మీ పిల్లలకు ఆరోగ్యం సరిగ్గా లేక అక్కడ డాక్టర్ ఏదైనా తట్టుకోలేని విషయం చెప్పినప్పుడు మీకు చెబితే బాధపడతారని చెప్పకుండా ఉంటుంటారు. మీ ఆయన కోప్పడినా సరే తప్పకుండా ఈ విషయాలు అడగాలి. లేకపోతే ఆయన ఒక్కడే లోలోపల బాధపడుతూ ఉంటాడు.

రహస్య జీవితం

తెలిసి చేస్తారో, తెలియక చేస్తారో కానీ కొన్నిసార్లు మీకు తెలియకుండా రహస్యబంధం పెట్టుకుని రహస్య జీవితాన్ని సాగిస్తుంటారు. అలా సాగించకుండా ఉండాలంటే మీరు మీ ఆయనపై ప్రతిక్షణం ప్రేమ చూపించాలి, మీ ఆయనే ప్రపంచంగా జీవించాలి. లేకపోతే వారి చూపు పక్కకు తిరిగే అవకాశం ఉంది.

భార్యగా నేనేమైనా మారాలా?

మీరు చేసే పనులు మీకు ఇష్టం ఉన్నా కొన్ని మీ ఆయనకు నచ్చవు, అలాగే మీ ఆయన చేసే పనులు కూడా మీకు ఇష్టం ఉండకపోవచ్చు. అటువంటప్పుడు మనసువిప్పి ఈ విధంగా అడగండి. ఏమండీ నావల్ల మీకు ఏ విషయంలోనూ ఇబ్బందిగా లేదు కదా, ఏమైనా ఉంటే చెప్పండి నన్ను నేను మార్చుకుంటాను అని వినయంగా అడిగితే ప్రతి భర్త తప్పక చెబుతారు. అయితే ఎందుకు నచ్చలేదు అని గొడవమాత్రం పెట్టుకోకండి.

నిజానికి దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఈ రహస్యాలు అస్సలు ఉండకూడదు. వారి సంసార జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే అందరికీ SHARE చేయండి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంట నే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

తెలుగు అమ్మలు మాత్రమే పిల్లల కోసం చేయగల 5 పనులు

Leave a Reply

%d bloggers like this: