దంపతుల మధ్య అనురాగం, అనుబంధం తార స్థాయికి చేరుకునేది పడక దిలోనే. అక్కడే అవధులు లేని ప్రేమను పొందుతారు. మనుసు శరీరాలు కలిసిపోతాయి. అయితే ఆ ఆనందాన్ని ఇంకా పెంచాలంటే, మీ ఆయన మీ నుంచి ఏమి కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి. అందుకే పడకగదిలో భర్త కోరుకునే విషయాలేంటో ఇక్కడ తెలుసుకోండి…
1. ముందు మీరే
ప్రతి భర్త, పడక గదిలో తన భార్య నుండి కోరుకునేది చొరవ. భార్య తనే చొరవ తీసుకుని, మొదలుపెడితే తాను చాలా సంతోషిస్తాడు. ప్రతిసారి కాకపోయిన, అప్పుడప్పుడు ఇలా చేయడానికి ప్రయత్నించండి.
2. అందమైన దుస్తులు
ఏకాంతంగా ఉన్నప్పుడు దుస్తుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకపోయినా, అది మొదలయ్యే ముందు ప్రతి భర్త తన భార్యను అందంగా, ఆశ్చర్యంగా కొత్త అనుభూతితో చుడాలనుకుంటాడు. ఆ కోరికను మీరే తీర్చాలి.
3. తనకు తానుగా
ముద్దు, కౌగిలింతలు ఇలా భర్త ఏదైనా చేయడానికి ప్రయత్నించినప్పుడు, వెంటనే మీరు తనకు అనుకూలంగా మారిపోవడం, వారికి చాలా ఇష్టం.
4. తన పేరు పలకడం
అవును,మీ ఇద్దరు మాత్రమే ఏకాంతంగా ఉన్నప్పుడు మీరు తారా స్థాయికి చేరుకున్నాక, తన పేరు మీ నోటి నుండి వస్తే అతను చాలా ఆనందపడుతాడు. మీ నుండి దాన్ని కోరుకుంటాడు.
5. చతురత
భార్యాభర్తలు ఒక్కరే ఉన్నప్పుడు కొన్ని తప్పులు నవ్వు తెప్పిస్తాయి. అప్పుడు మీరు కూడా తనతో కలిసి నవ్వడం తనకు చాలా ఇష్టం.
6. మాట్లాడడం
మగవాళ్ళు భార్యతో ఉన్నప్పుడు చెప్పే మాటలు ఉంటే, దానిని ఇంకా ఎంజాయ్ చేస్తారు. అందుకే మీరు ఆ సమయంలో మీకు ఎం కావాలో చెప్పడం, తన గురించి అడగడం ఇలా ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నించండి.
7.మహిళలకు ఆనందం కలిగించడం
ఎక్కువ మంది భర్తలు పడకగదిలో తమ భాగస్వామి నుండి కోరుకునేది ఇదే. తమ భార్యలకు ఆనందాన్ని కలిగించేలా పాల్గొనడం. మీరు దానికి అనుగుణంగా ఉండాలి..