చేతి వేళ్ళ సైజును బట్టి మీ వ్యక్తిత్వం గురించి ఈజీగా తెలుసుకోవచ్చు : ఎలాగో ఇక్కడ చూడండి

పిల్లలు పుట్టినప్పడి నుండి వారి భవిష్యత్ గురించి ప్రతి తల్లితండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. పుట్టిన నక్షత్రం ప్రకారం వారి జాతకం ఎలా ఉందని, చేతి రేఖల ద్వారా  వారి భవిష్యత్ గురించి తెలుసుకోవడం చేస్తుంటారు. ఇవేమీ కాకుండా మీ పిల్లల చేతి వేళ్ళ సైజును బట్టి వారు ఎంత మేధావులో,  ఫ్యూచర్ లో ఏమవుతారో ఇట్టే తెలుసుకోవచ్చు.  

చూపుడు వేలు ఉంగరం వేలు కంటే చిన్నదిగా ఉంటే

చూపుడు వేలు ఉంగరం వేలు కంటే చిన్నదిగా ఉంటే మగ పిల్లలు చాలా తెలివైనవారు. ఎప్పుడు భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ముందుచూపు ఎక్కువ

ఉంగరం వేలు చూపుడు సమానంగా ఉంటే

ఉంగరం వేలు, చూపుడు వేలు సైజు ఒకే విధంగా ఉంటే ఆడపిల్లలు చాలా మేధావులు అని గుర్తించండి. ఎంతో చలాకీగా ఉంటారు. ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి ఇష్టపడతారు.

మధ్యవేలు ఉంగరం వేలు సమానంగా ఉంటే

ఇటువంటి పిల్లలు (మగ, ఆడ) చాలా సృజనాత్మకంగా ఉంటారు. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచిస్తారు. వీళ్ళు చేసేపనులు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి.

బొటనవేలు చిటికెన వేలు ఒకే సైజులో ఉంటే

సాధారణంగా బొటనవేలు చిటికెన వేలు ఒకే విధంగా ఉండటం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఇటువంటి పిల్లలకు ప్రయోగాలు అంటే చాలా ఇష్టం. కెరీర్ గురించి ప్రత్యేకమైన ప్రణాళికలు ఉండకపోయినా ఉన్నతమైన జీవితం గురించి పక్కా క్లారిటీతో ఉంటారు.

ఉంగరం వేలు చిటికెన వేలు సమానంగా ఉంటే

ఇటువంటి పిల్లలు మేధావితనానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు. అలాగే నైపుణ్యం కలిగిన వారు.  తమ చుట్టూ ఉన్న వారితో ప్రేమగా మెలుగుతూ అందరినీ ఒకే విధంగా చూస్తారు.

చిటికెన వేలు పెద్దదిగా ఉంగరం వేలు చిన్నదిగా

ఇలా అతి కొద్దిమందిలోనే ఉంటుంది. ఇలాంటి పిల్లలను అసాధ్యులు, అసాధారణమైన వారు అని గుర్తించాలి. ఏదీ ప్లాన్ చేసుకోకుండా ముందుకు వెళ్లడం వీరి నైజం. పెద్దయ్యాక ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించడానికి ఇష్టపడతారు. 

ఇలా చేతి వేళ్ళు విభిన్నంగా ఉండటానికి ఉదరంలో ఉండే టెస్టోస్టిరాన్ మరియు ఈస్ట్రోజన్ హార్మోన్లే కారణం.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

బ్రెస్ట్ మిల్క్ పెంచడానికి ఆయుర్వేద ఆహారాలు

Leave a Reply

%d bloggers like this: