మగవాళ్ళు తమ భార్యలు ఎలా ఉండాలి అని కోరుకుంటారు? 10 మంది మగాళ్లు ఎంత వెరైటీగా చెప్పారో చూడండి

ప్రస్తుతం మగవారికి తమ భార్యలు ఎలా ఉండాలని కోరుకుంటారు. భార్యలు ఏ విధంగా ఉంటే భర్తకు ఇష్టం? అనే ప్రశ్నలు చాలామంది మహిళలకు ఉన్నాయి.  కొందరు ఈ విషయాలను బయటకు చెప్పుకోలేకపోతున్నారు, మరికొందరు చెప్పుకుంటున్నారు.  అయితే తమ భార్యలు ఇలా ఉండాలని 15 మంది భర్తలు మాతో పంచుకున్నారు. అవేంటో మీరే తెలుసుకోండి.

స్వతంత్రంగా ఉండాలి

ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఒకరిపై ఆధారపడుకుండా తన ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే స్వతంత్రంగా ఉండాలని నా భార్య నుండి నేను కోరుకుంటున్నాను. నేను చేసే పనికి ఎవరైనా ఏమనుకుంటారో అని సిగ్గుపడకుండా తనకు ఎలా అనిపిస్తే ఆ విధంగా చేయాలి. -వంశీ

వంటింటికి పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు

నా భార్య ఎప్పుడు నా కోసం వంటగదిలో కమ్మనైన భోజనాన్ని వండిపెట్టే ఒక మెషిన్ గా పనిచేయడం నాకు ఇష్టం లేదు. నేను కూడా ఈ పని చేయగలను, నేను మన కోసం, మన కుటుంబం కోసం ఏమైనా చేయాలనుకుంటున్నాను అని ఆలోచించే భార్యను కోరుకుంటున్నాను. -మహేష్

ఆకలితో ఉన్నా ప్రేమగా ఉండకూడదు

భర్త ఆఫీస్ నుండి రావడం ఆలస్యం అవుతుందని తెలిసినా తను ఆకలితో ఉండి భర్త కోసం ఎదురుచూడటం ప్రేమ అనిపించుకోదు. మూర్ఖత్వం అవుతుంది. నా కోసం నా భార్య ఎదురుచూడటమే ప్రేమ కాదు. -హర్ష

నవ్వుతూ నవ్వించాలి

నేను ఏదైనా జోక్ వేసినప్పుడు నా భార్యకు అంతే సెన్సాఫ్ హ్యూమర్ ఉండాల్సిన అవసరం లేదు కానీ కొంచెమైనా సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే మా జీవితం మరింత సంతోషకరంగా ఆనందంగా ఉంటుంది. -ధీరజ్

నాతో సమానమే

భార్యాభర్తలు ఇద్దరూ సెరిసగం అనే విషయాన్ని నేను పూర్తిగా నమ్ముతాను. భర్తగా నాకు ఎంత హక్కు ఉందో, భార్యగా తనకు అంతే హక్కు, బాధ్యత ఉంది. నా దృష్టిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. మేమిద్దరం సమానమే అనిపించినప్పుడే ప్రతి దాంపత్య జీవితం బాగుంటుంది. -ఆకాష్

నమ్మకం, క్షమాపణ

మన జీవితంలోకి వచ్చిన అమ్మాయి భార్యగా స్వీకరించినప్పుడు నిజాయితీ, నమ్మకం, ప్రేమ, లైంగికంగా కలిసిపోవడం, తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరడంలో తప్పేమీ లేదు. అప్పుడే కదా ఇద్దరి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది. -పవన్

మౌనంగా ఉండకూడదు

ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నా భార్య కూడా ఏదైనా సలహా ఇవ్వడం లేదా, మంచేదో చెడేదో చెప్పడం చేయాలి గానీ నేనేం చేసినా, ఏది చెప్పినా మీరే కరెక్ట్ అని మౌనంగా ఉండటం మంచిది కాదు. తన మౌనమే భర్త తప్పులకు కారణమవుతుంది. -ప్రవీణ్

ఇష్టాలను పంచుకోవాలి

ఒకరి మనసులో మాటలను చెప్పకుండా తెలుసుకోవడం కొంతమందికే సాధ్యం కాబట్టి, వారికి ఏమి ఇష్టమో అది చేయాలనుకున్నప్పుడు ప్రతి భార్య తన భర్తతో పంచుకోవాలి. వారి ఇష్టాలను చెబితేనే కదా ఏ భర్తకైనా తెలుస్తుంది. భార్యల ఇష్టాలను భర్త ఎప్పటికీ కాదనలేరు. -యోగేష్

బెస్ట్ ఫ్రెండ్ లా ఉండాలి

నా భార్య ఇలానే ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు అనే రూల్స్ ఏ భర్త ఇప్పుడు కోరుకోవడం లేదు. ఒక మంచి స్నేహితుడిలా అర్థం చేసుకునే భార్య తన జీవితంలోకి రావాలని, తన ప్రతి విషయాన్ని తనతో షేర్ చేసుకునే భార్య కావాలని కోరుకుంటాడు. -వినోద్

భయపడకుండా ఓపెన్ గా చెప్పాలి

మగవాళ్ళు కదా అని భయపడకుండా భర్త తెలిసో తెలియకో చేసిన తప్పును గానీ, వేస్తున్న తప్పటడుగులను కానీ భార్య ఖచ్చితంగా ఓపెన్ గా చెప్పాలి. ఇలా భార్య చెప్పకపోతే భర్తకు ఇంకెవరూ చెప్పకపోవడం వలన మీ దాంపత్య జీవితానికే నష్టం కలుగుతుంది. – చంద్రశేఖర్

ప్రోత్సహించాలి

భర్త చేస్తున్న పని చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా భర్త వేసే ప్రతి అడుగులో నేను మీకు తోడుగా ఉన్నానంటూ ప్రోత్సహించాలి. భార్య ఇచ్చే ఈ ప్రోత్సాహమే భర్త మరిన్ని విజయాలకు దారి తీస్తుంది. మీరిచ్చే ప్రోత్సాహాన్ని మరెవరూ ఇవ్వలేరు. -శివ

దయ, సహాయ గుణం ఉండాలి

ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడే మనిషిలోని మంచి గుణం, దయ బయటకు వస్తుంటాయి. తమ జీవితంలోకి వచ్చే భార్య ఎప్పుడు తన స్వార్థం, తన కుటుంబ స్వార్థమే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించాలి. దీనికోసం ఫ్యామిలీని పక్కనపెట్టాల్సిన అవసరం లేదు, అందులో ఒక భాగంగానే చూసుకోవాలి. -రవి

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా,  ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

Leave a Reply

%d bloggers like this: