పసిపిల్లలకు ‘ఫార్ములా పాలు’ పట్టించవచ్చా..! అమ్మ పాలు ఎప్పటికి వరకు ఇవ్వాలో తెలుసుకోండి

ప్రెగ్నన్సీ తరువాత మీరు తీసుకునే నిర్ణయాలలో, ముఖ్యమైనది మీ పిల్లలకు తల్లి పాలు ఇవ్వాళా, లేదా ఫార్ములా పాలు (డబ్బా పాలు) ఇవ్వాళా? ఈ నిర్ణయం మీ పిల్లల ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. అయితే మీరు దీని మీద ఒక నిర్ణయం తీసుకోడానికి, ఉపాయాగపడేలా…  తల్లి పాలు, ఫార్ములా పాలు మధ్య తేడాలను వివరిస్తున్నాం.

తల్లి పాలు

అనేక ప్రభుత్వ సంస్థల నివేదిక ప్రకారం, తల్లి పాలు పిల్లలకు అత్యంత పోషక విలువలతో కూడిన ఆహరం. పిల్లలకు ఆరు నెలల వయసు వచ్చే వరకు, తల్లి పాలు తప్పకుండా ఇవ్వాలి. వేరే ఆహారాలు అలవాటు చేసిన తరువాత కూడా, మొదటి ఏడాది పూర్తయ్యే వరకు తల్లి పాలు ఇవ్వడం ఉత్తమం

ప్రయోజనాలు:

1. పిల్లలు రోగాలను ఎదురుకోవడానికి అవసరమైన సహజమైన ఆంటీబాడీస్ ను అందిస్తుంది.

2. సులువుగా అరుగుతాయి. దీని వలన పిల్లలకు మలబద్ధకం, గాస్ సమస్యలు ఉండవు.

3. పిల్లలలో sudden infant death syndrome, వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

4. పిల్లల తెలివితేటలు పెరుగుతాయి.

5. భవిష్యత్తులో డయాబెటిస్, ఆస్తమా లాంటి రోగాలు రాకుండా వుండే అవకాశాన్ని పెంచుతుంది.

6. బ్రెస్ట్ ఫీడింగ్ చేసే తల్లులు కూడా దీని వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి రోగాలు రాకుండా ఉంటాయి.

అప్రయోజనాలు:

1. పిల్లలు ఎంత పాలు తాగారో తెలుసుకోలేము.

2. తల్లి పాలు తాగే పిల్లలు రాత్రి పూట ఎక్కువగా నిద్ర లేస్తారు.

3. పని చేసే మహిళలకు కొంత ఇబ్బందిగా ఉండచ్చు.

ఫార్ములా పాలు(డబ్బా పాలు)

తల్లి పాలకు ప్రత్యామ్నాయ, డబ్బా పాలు. పిల్లలకు ఈ పాలు ఎంచుకోడానికి అనేక కారణాలు ఉంటాయి. కొంత మందికి ఆరోగ్యసమస్యలు అయ్యివుండచ్చు, ఇంకొంత సమయం ఉండకపోవచ్చు. ఏదేమైనా ఫార్ములా మిల్క్ గురించి తెలుసుకోవడం మంచిది.

ప్రయోజనాలు:

1. పిల్లలకు పాలు ఎవరైనా పట్టించచ్చు.

2. మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువ మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు.

3. మీ భర్త కూడా పిల్లలకు పాలు పట్టించచ్చు. దాని ద్వారా పిల్లలకు మీ భర్తకు మంచి బాంధవ్యం ఏర్పడుతుంది.

4. పిల్లలకు పాలు పట్టించే వేళలను, సరిగ్గా నిర్ణయించచ్చు.

అప్రయోజనాలు:

1. పిల్లలకు కావాల్సిన పోషక విలువలు అందవు.

2. పిల్లలలో ఎదుగుదల లోపిస్తుంది.

3. అరుగుదల సరిగావుండదు, దీని వలన మలబద్దకం, కడుపునొప్పి లాంటి సమస్యలు వస్తాయి.

4. పిల్లలలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.

మీరు ఏది ఎంచుకున్నా, మీ పిల్లలు సరైన వేళలలో, పాలను తక్కువవకుండా పట్టించండి.

ఇది అందరి తల్లులకు ఈ వివరాలు  తెలిసేలా SHARE చేయండి

ఇవి కూడా చదవండి

పిల్లలలో ఆకలిని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు

Leave a Reply

%d bloggers like this: