“మా మధ్య ఎప్పుడు ఏ గొడవలు జరగలేదు!!” అని ఏ దంపతులైన చెప్పడం మీరు ఎప్పుడైనా విన్నారా? అలా జరగదని మీకు తెలుసు. భార్య భర్త మద్య కొన్ని కోపాలు తాపాలు సహజం. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యంలో సమస్యలు రావడం తప్పదు. కానీ మీ గొప్పతనం ఎక్కడుందో తెలుసా? ఆ సమస్యలను పరిష్కారించి, మీ దాంపత్యాన్ని కాపాడుకోవడంలో…
దంపతుల మధ్య సాధారణంగా ఎదురయ్యే కొన్ని సాన్నిహిత్య సమస్యలు, వాటి పరిష్కారాలు…
1. రొటీన్ లైఫ్
ఇదే మీ మధ్య సాన్నిహిత్యం తగ్గిపోవడానికి ప్రధాన కారణం. ప్రతి రోజు ఉరుకుల పరుగుల జీవితంలో, కలిసి ఒకే ఇంట్లో ఉన్న, కలిసి బ్రతకడంలేదు. అన్నిపొదుపు అయిపోయాయి. మాటలుతో సహా… ఈ సమస్య మీ మధ్య దూరాన్ని పెంచుతుంది. అందుకే ప్రతి రోజు మీ మధ్య తప్పకుండా మాటలు జరగాలి. పిల్లల ఫీజులు, కట్టాల్సిన అప్పులు ఇవి కాదు. మీ ఇద్దరి గురించి మాట్లాడుకోండి.
2. ఆకర్షణ తగ్గిపోవడం
మీ పెళ్ళైన మొదట్లో ఒకరి మీద నుండి ఒకరివి చూపులు తప్పిపోయేవి కావు. గంటలు కొద్ది అయినా సరే సమయాన్ని కలిపి గడపడానికి ఇష్టపడేవారు. కాలం గడిచే కొద్ది ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గిపోతుంది. అలా జరగనివ్వద్దు. మీ భాగస్వామికి నచ్చేలా ఉండడానికి ప్రయత్నించండి. తనకు ఇష్టమైన రంగు బట్టలు వేసుకోండి. ముఖ్యంగా మీ అందం కన్నా, మీరు తనతో ఉండే పద్దతి మీ భాగస్వామిని ఆకర్షిస్తుంది. దానిని వదులుకోవద్దు.
3. అనుమానం
పెళ్ళి అనే బంధాన్ని నిలబెట్టే, రెండు స్తంబాలు నమ్మకం, విశ్వాసం. మీ ఇద్దరి మధ్య ఇవి లేని రోజు , దాంపత్యం కూలిపోతుంది. అనుమానం కలిగితే, దాన్ని మనసులో దాచుకుని పెద్దది చేసుకోవద్దు. మీ భాగస్వామితో మాట్లాడండి. గుర్తుపెట్టుకోండి, కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి.
4. సరదాలు ఏమైపోయాయి?
కవ్వింతలు, ఆటపట్టించుకోవడాలు, వెక్కిరింతలు, ఇవన్నీ మీ దాంపత్యంలో ఒకప్పుడు భాగమే కదూ. వీటన్నిటిని మీరు ఎంతో ఇష్టంగా చేసుంటారు. ప్రేమను చూపించడానికి ఇదో పద్దతి. అవన్నీ ఇప్పుడేమైపోయాయి? ఆ సరదా సంగతులు మీ మధ్య మళ్ళి జరిగేలా చూసుకోండి. మీ సాన్నిహిత్యాన్ని కాపాడుకోండి.
5. తల్లి తండ్రులు అయ్యాక..
అవును భార్య భర్తలుగా ఉన్న మీరు, తల్లి తండ్రులు అయ్యాక మీ మధ్య సాన్నిహిత్యం తగ్గుతుంది. పిల్లలు పుట్టాక, మీరిద్దరూ కలిసి గడిపే సమయం తగ్గిపోతుంది. దీనిని అలాగే కొనసాగించి దూరాన్ని పెంచుకోకండి. ఏదో విధంగా ఇద్దరు కలిసి సమయాన్ని గడపడానికి వీలు చూసుకోండి.
6. మనస్పర్థలు
గొడవైనప్పుడు ఆవేశంలో మాటలు దొల్లి, కోపాన్ని పెంచుకుని, మనస్పర్థలతో కాపురానికి నష్టం కలిగించుకోవద్దు. భార్య భర్తల మధ్య గొడవలు జరగడం ఎంత సహజమో, వెంటనే పరిష్కారం అవడం కూడా అలానే జరిగిపోవాలి. చిన్న సారీ మీ దాంపత్యాన్ని కాపాడగలుగుతుంది అని మీరనుకుంటే చెప్పడానికి సంకోచించద్దు.
7. ఏకాంతంగా ఉండటం
తప్పకుండా మీ మధ్య సాన్నిహిత్యాన్ని కాపాడుకోవడంలో, ఇది కూడా ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది. అందుకే ఏకాంతంగా ఉండటం పూర్తిగా దూరం అయిపోకండి. ఆ ఆసక్తిని కాపాడుకోండి.
మీ భాగస్వామికి ఈ విషయాలన్నీ తెలిసేలా తప్పకుండా SHARE చేయండి
ఇవి కూడా చదవండి…
“మీరెప్పుడు నాతోనే ఉండాలి… “ అని మీ ఆయనకు అర్ధమయ్యేలా చెప్పడానికి చేయాల్సిన పనులు